Movie News

దేవకన్యలు చీర కడితేనే సెన్సార్ సర్టిఫికెట్!

అల్లరి నరేష్ హీరోగా వస్తున్న ‘రంభ ఊర్వశి మేనక’ రిలీజ్‌కు ముందు ఊహించని సమస్యలో పడినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 3న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని టీమ్ ప్లాన్ చేసింది. కానీ చివరి సమయంలో సెన్సార్ దగ్గర ఇబ్బంది వచ్చిందట. సినిమాలో దేవకన్యలుగా కనిపించే నటీమణుల కాస్ట్యూమ్స్‌పై సీబీఎఫ్‌సీ అభ్యంతరం చెప్పినట్లు సమాచారం.

‘రంభ ఊర్వశి మేనక’ టైటిల్‌కు తగ్గట్టుగానే ఫాంటసీ, కామెడీతో తెరకెక్కిన సినిమా. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్‌లో కూడా అదే ప్రపంచాన్ని చూపించారు. దేవకన్యలు, మాయలు, వాటి మధ్య అల్లరి నరేష్ పాత్రతో కామెడీ నడిచేలా కథ ఉండబోతోందని టీజర్‌తోనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అదే దేవకన్యల లుక్ దగ్గర సెన్సార్ సమస్య వచ్చిందని టాక్.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్లు వేసుకున్న దుస్తులు మార్చాలని సెన్సార్ నుంచి సూచనలు వచ్చాయట. అందులో చీరలు కట్టేలా మార్పులు చేయాలని చెప్పినట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఫాంటసీ కథలో భాగంగా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కే ఇలాంటి అభ్యంతరం రావడంతో మేకర్స్ కూడా వెంటనే మార్పులకు వెళ్లకుండా మరో మార్గం చూస్తున్నారట.

అందుకే ఇప్పుడు చిత్రబృందం రివైజింగ్ కమిటీని ఆశ్రయించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. అక్కడ అనుమతి వస్తే పెద్దగా మార్పులు లేకుండానే సర్టిఫికెట్ దొరికే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని షాట్స్ లేదా కాస్ట్యూమ్స్ విషయంలో మార్పులు తప్పకపోవచ్చు. రిలీజ్‌కు ఇంకా చాలా తక్కువ సమయం ఉండటంతో ఈ ప్రక్రియ వీలైనంత త్వరగ పూర్తవ్వాలని చూస్తున్నారు.

ఇక్కడ అసలు టెన్షన్ సర్టిఫికెట్ కంటే రిలీజ్ డేట్ దగ్గరే ఉంది. సెప్టెంబర్ 3కు ఇప్పటికే ప్లాన్ చేసుకున్న సినిమా కావడంతో చివరి నిమిషంలో సెన్సార్ ఆలస్యం అయితే థియేటర్లు, ప్రమోషన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఒకవేళ రివైజింగ్ కమిటీ దగ్గర కూడా వెంటనే క్లారిటీ రాకపోతే సినిమా వాయిదా పడే అవకాశం ఉందన్న టాక్ కూడా ఉంది. సీరియస్ సినిమాల తర్వాత అల్లరి నరేష్ మళ్లీ పూర్తి కామెడీ వైపు వచ్చిన సినిమా ఇదే. అందుకే ‘రంభ ఊర్వశి మేనక’తో పాత అల్లరి నరేష్ జోన్ మళ్లీ కనిపిస్తుందనే అంచనా ఉంది. ఇక సినిమా కంటెంట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.

This post was last modified on August 30, 2026 4:52 pm

Share

Recent Posts

ఓటేయకుండా బెంగళూరు వెళ్ళిపోయిన జగన్

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన అవసరం వుంది. అయితే బాధ్యాయుతమైన ఒక ప్రతిపక్ష నాయకుడు ఓటు…

2 hours ago

ఇప్పటివరకు చూడని సూర్యావతారం

ఎన్నో ఏళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ సూపర్ స్టార్ సూర్య.. ఈ ఏడాది రెండు…

2 hours ago

‘రాప్తాడు’ బాలికకు రాబోయే 48 గంటలు కీలకం

అనంతపురం జిల్లాలోని రాప్తాడులో పదో తరగతి బాలికపై తరగతి గదిలోనే అత్యంత పాశవికంగా ఒక ఉన్మాది ఎలక్ట్రికల్ రంపం(చైన్ సా)తో…

3 hours ago

RC17… అసలు విషయం చెప్పలేేదే

‘రంగస్థలం’ లాంటి కల్ట్ బ్లాక్‌బస్టర్ అందించిన రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో కొత్త సినిమా కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు…

3 hours ago

రోడ్డుపై కూర్చొని జగన్ నిరసన

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలోని బ‌కారాపురంలో హ‌ల్చ‌ల్ చేశారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను…

4 hours ago

జ‌గ‌న్‌కు.. మా జీవితాలు నాశనం చేశావ్!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చేదు అనుభవం ఎదురైంది. పులివెందుల‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చిన జ‌గ‌న్‌కు అనూ హ్యంగా వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో…

5 hours ago