ఇరుముడికి ఎలాంటి ఇరుకు లేదు

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా మీద బయ్యర్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. అందరూ ఎదురు చూస్తున్న బంగారు పల్లకి సాంగ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లాంచ్ చేయబోతున్నారు. ప్రమోషన్స్ పరంగా మైత్రి సంస్థ మరీ అగ్రెసివ్ గా వెళ్లడం లేదు. బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల హడావిడి ఎక్కువగా ఉండటంతో కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది.

ఇరుముడికి పోటీ పరంగా కానీ ఇతరత్రా విషయాల్లో ఎలాంటి ఇరుకు కనిపించడం లేదు. ఎందుకంటే విశ్వనాథ్ అండ్ సన్స్ కు పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ అది మాస్ ఆడియన్స్ ని పెద్ద ఎత్తున లాగే మూవీ కాదు. ఫ్యామిలీ ప్రేక్షకుల అండతోనే సేఫ్ అయిపోతుంది. కొరియన్ కనకరాజు ఇప్పటికే నెమ్మదించిపోగా మూడో వారం హోల్డ్ ని ఆశించలేం. లోకేష్ కనగరాజ్ డిసి సైతం బిసి సెంటర్స్ లో స్లో అయిన వైనం స్పష్టంగా కనిపిస్తోంది. సో వచ్చే వారం గ్రౌండ్ కాస్త ఫ్రీగానే ఉంటుంది.

క్లాష్ అవుతుందనుకున్న దుల్కర్ సల్మాన్ ఐ యాం గేమ్ రెండు వారాలు వెనక్కు వెళ్లిపోవడం ఇరుముడికి పక్క రాష్ట్రాల్లో ప్లస్ కానుంది. ముఖ్యంగా కర్ణాటక, కేరళలో ఇది సానుకూలంగా పని చేస్తుంది. పృథ్విరాజ్ సుకుమారన్ ఖలీఫా ఉంది కానీ దాని మీద ఉన్న బజ్ చాలా తక్కువ స్థాయిలో నెలకొంది. సో అసలది కాంపిటీషన్ గానే భావించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అయితే అసలు సమస్య కేవలం అయిదు రోజుల గ్యాప్ తో రిలీజవుతున్న టాక్సిక్ రూపంలో ఎదురవుతుంది.

ఏపీ తెలంగాణలో దిల్ రాజు ద్వారా డిస్ట్రిబ్యూట్ కానుండటంతో వైడ్ రిలీజ్ దక్కనుంది. పైగా హైప్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కర్ణాటకకు ధీటుగా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఓపెనింగ్స్ మన దగ్గర వచ్చినా ఆశ్చర్యం లేదు. సో ఇరుముడి ఆలోగా యునానిమస్ టాక్ తో నిలబడితే ఎలాంటి టెన్షన్ ఉండదు. ఎందుకంటే టాక్సిక్ ఏ రేటెడ్ కాబట్టి పిల్లలు దూరంగా ఉంటారు. రవితేజ మూవీకి ఆ ఇబ్బంది ఉండకపోవచ్చు. యు/ఏ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.