Movie News

ఎంఎస్‌ రాజుతో ప్రభాస్ పార్టీ ఎలా ఉంటుంది?

ప్రభాస్ అంటే అతిథులకు అపరిమితమైన భోజనం పెట్టి వాళ్లను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తాడనే పేరుంది. ఐతే అతను పెద్ద స్టార్‌గా ఎదిగాకే ఇలా మారాడేమో అనుకుంటారు చాలామంది. కానీ అతను మొదట్నుంచి అంతే అంటున్నారు సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు. ప్రభాస్‌కు కెరీర్లో తొలి పెద్ద హిట్ ఇచ్చిన ఘనత రాజుదే. ఆయన బేనర్లో చేసిన ‘వర్షం’ చిత్రంతోనే ప్రభాస్ కెరీర్ మలుపు తిరిగింది. ఆ టైంకి రాజు స్టేచరే వేరు. ఆయన సంస్థలో సినిమా చేయాలని పెద్ద పెద్ద స్టార్లు కూడా తహతహలాడేవారు.

అప్పుడు ‘బాబి’ లాంటి డిజాస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన శోభన్‌ను పెట్టుకుని, కెరీర్‌లో తొలి అడుగులు వేస్తున్న ప్రభాస్‌తో భారీ బడ్జెట్లో ‘వర్షం’ తీసి సెన్సేషనల్ హిట్ కొట్టారు రాజు. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించడమే కాక.. మేకింగ్ అంతా దగ్గరుండి చూసుకున్నారు రాజు. అందుకే ఆయనంటే ప్రభాస్‌కు ప్రత్యేకమైన అభిమానం.

ఐతే తన అభిమానాన్ని మనసులో పెట్టుకోకుండా.. తనను కలిసిన ప్రతిసారీ చూపించేవాడని రాజు ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. తాను పనిలో బిజీగా ఉన్నా కూడా వదిలేవాడు కాదని, తన ఇంటికి పిలిచి పార్టీల్లో ముంచెత్తేవాడని ఆయన తెలిపారు. అప్పటికి ప్రభాస్ ఇంట్లో ఒక భారీ స్క్రీన్ ఉండేదని.. దాని మీద ఇళయరాజా పాటలు ప్లే చేసుకుని చూసుకుంటూ ఉండేవాడని.. తాను వెళ్లినపుడు మాత్రం ‘వర్షం’ సినిమా వేసి చూపించేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రభాస్ తనను బావ బావ అంటాడని.. తాను మాత్రం ప్రభాస్ అనే పిలుస్తానని.. ‘వర్షం’ సినిమాలో తన ఇంట్రో సీన్ ప్లే చేస్తూ తనకు అది చూపించి మురిసిపోయేవాడని రాజు తెలిపారు. 

ఇక ఫుడ్, మందు సెటప్ మామూలుగా ఉండేది కాదని.. రూంలో ఒక చోట కూర్చుంటే లేచి బయటికి వెళ్లాలన్నా కుదిరేది కాదని.. అలా పాత్రల్ని పరిచేసి ఉండేవారని.. ప్రభాస్‌తో పాటు వంశీ, ప్రమోద్ లాంటి మిత్ర బృందమంతా కిందనే కూర్చుని భోంచేసేవారని.. తాను లావుగా ఉంటా కాబట్టి చైర్ వేసేవారని రాజు గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ప్రభాస్‌కు తనంటే ప్రత్యేకమైన అభిమానమని, ఇంకా తనను బావ అనే పిలుస్తాడని రాజు అన్నారు. ఈ లెజెండరీ ప్రొడ్యూసర్ కొన్నేళ్లుగా దర్శకుడిగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడాయన్నుంచి ‘అగధ’ అనే చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది. 

This post was last modified on August 12, 2026 7:09 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

1 hour ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

3 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

4 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

4 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

4 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

5 hours ago