Movie News

టాక్సిక్ విధ్వంసం 191 నిమిషాలు ?

ఆగస్ట్ 26 విడుదల కాబోతున్న టాక్సిక్ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయినట్టుగా బెంగళూరు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఫైనల్ రన్ టైం 3 గంటల 11 నిమిషాలకు లాక్ చేశారని తెలిసింది. గత కొన్నేళ్లుగా ఇంత నిడివి ఉండటం పెద్ద సమస్యగా అనిపించడం లేదు. దురంధర్ ఇంతకన్నా ఎక్కువే ఉన్నా బ్రహ్మరథం పట్టారు. దాని సీక్వెల్ కి ఇంకో అరగంట పెంచినా వందల కోట్లు కురిపించారు. అంతకు ముందు పుష్ప 2 ది రూల్ సైతం లెన్త్ విషయంలో రాజీ పడకుండా విజయం సాధించింది.

ఇక టాక్సిక్ విషయానికి వస్తే అందరూ ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. పెద్దలకు మాత్రమే ముద్ర పడటంలో ఎంత మాత్రం ఆశ్చర్యం లేదు. ఆ స్థాయిలో వయొలెన్స్ ఉంది. దానికి తోడు హీరో యష్ నగ్నంగా కనిపించే సన్నివేశాలూ ఉన్నాయి. అఫ్కోర్స్ వాటిని బ్లర్ చేసినా ప్రేక్షకులకు అసలు ఉద్దేశం ఏమిటో అర్థమైపోతుంది. యానిమల్ తరహా రక్తపాతం, బోల్డ్ నెస్ టాక్సిక్ లో పుష్కలంగా ఉంది. ముఖ్యంగా యష్ ట్రిపుల్ రోల్ ఎలా చేసుకుంటాడనే దాని మీద అంచనాలు ఎక్క్కువగా ఉన్నాయి.

ఇటీవలే బెంగళూరులో చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నయనతార, కియారా అద్వానీతో సహా అందరూ హాజరు కావడం ఆకర్షించింది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మహిళే అయినప్పటికీ ఇంత ఇంటెన్స్ డ్రామా తెరకెక్కించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీజర్ టైంలో పలు వివాదాలు వచ్చాయి కానీ ఆ తర్వాత సద్దుమణిగాయి. ఆగస్ట్ 14 హైదరాబాద్ లో ఈవెంట్ చేయబోతున్నారు. దీనికి కూడా కాస్ట్ అండ్ క్రూ మొత్తం హాజరయ్యే అవకాశం ఉందని ఇన్ సైడ్ టాక్.

పెద్ది తర్వాత అంత పెద్ద సినిమా బాక్సాఫీస్ కు రాలేదు. లెనిన్, మా ఇంటి బంగారం, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, డిసి మొదలైనవి మీడియం బడ్జెట్ లో తీసినవే. వాటిలో రెండు మాత్రమే వంద కోట్ల గ్రాస్ సాధించాయి. కానీ టాక్సిక్ అలా కాదు. వందల కోట్లతో రూపొందడమే కాదు బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుపుకుంటోంది. తెలుగులో దిల్ రాజు పంపిణి కావడంతో పెద్ద ఎత్తున రిలీజ్ ఉండబోతోంది. రవి బస్రూర్ సంగీతం కెజిఎఫ్ స్థాయిలో ఉంటుందని మ్యూజిక్ లవర్స్ ఆశిస్తున్నారు.  

This post was last modified on August 10, 2026 11:06 pm

Share

Recent Posts

మేయ‌ర్ స్థానాల‌పై ప‌ట్టు.. జ‌న‌సేన వ్యూహ‌మేంటి.. ?

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మేయర్ స్థానాలపై జనసేన పార్టీ గట్టి పట్టు సాధించాలని వ్యూహరచన చేస్తోంది. కూటమి…

2 minutes ago

బుచ్చిబాబు మిస్సయ్యింది శ్రీకాంత్ చేజారకూడదు

సరిగ్గా మూడు నెలల ఇరవై ఎనిమిది రోజుల క్రితం పెద్ది రిలీజయ్యింది. ఒకే సినిమా అనుభవమున్న దర్శకుడు బుచ్చిబాబుని నమ్మి…

2 hours ago

కర్ణుడిగా లారెన్స్… రిస్క్ అవుతుందా

డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలుపెట్టి, దర్శకుడు కం హీరోగా మారి, హారర్ కామెడీ అనే కొత్త జానర్ సృష్టించి,…

3 hours ago

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

4 hours ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

8 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

8 hours ago