Movie News

సురేఖవాణి జిమ్ వర్కవుట్ చూస్తే మతి పోతుంది

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖవాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. సినిమాలతో కంటే నెట్టింట పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలతోనే ఆమె ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటారు. రీసెంట్ గా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని జిమ్ వర్కౌట్ వీడియోలు నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఎప్పుడూ వెకేషన్స్, డాన్స్ రీల్స్ తో ఫుల్ జోష్ లో కనిపించే ఆమె ఇలా హార్డ్ కోర్ జిమ్ సెషన్స్ లో కష్టపడుతుండటం అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది. 

డైరెక్ట్ గా మేటర్ లోకి వస్తే ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వయసులో కూడా ఫిట్ నెస్ పై ఆమె చూపిస్తున్న డెడికేషన్ మామూలుగా లేదు. డంబెల్స్ పట్టుకుని చాలా సీరియస్ గా వర్కౌట్స్ చేస్తున్నారు. ఒక ఏజ్ వచ్చాక చాలామంది ఫిట్ నెస్ ను పెద్దగా పట్టించుకోరు, లైట్ తీసుకుంటారు. కానీ సురేఖ వాణి మాత్రం తన బాడీని పర్ఫెక్ట్ షేప్ లో ఉంచుకునేందుకు జిమ్ లో గంటల తరబడి చెమటోడుస్తున్నారు. 

వర్కౌట్స్ తో పాటు తన గ్లామర్ తో కూడా నెటిజన్లను ఎప్పటిలాగే అట్రాక్ట్ చేస్తున్నారు. వైట్ కలర్ స్పోర్ట్స్ బ్రా, బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి ఎంతో ఫిట్ గా కనిపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా గ్లామర్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని మరోసారి ప్రూవ్ చేశారు. యంగ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో తనదైన ఫాలోయింగ్ ను కంటిన్యూ చేస్తున్నారు.

సురేఖ వాణి కెరీర్ విషయానికి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక బలమైన ముద్ర వేశారు. అక్క, వదిన, తల్లి లాంటి పాత్రల్లో ఎంతో సహజంగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఈమధ్య వెండితెరపై కాస్త తక్కువగానే కనిపిస్తున్నారు. ఆ గ్యాప్ ను సోషల్ మీడియా ద్వారా ఫిల్ చేస్తూ తన లైఫ్ స్టైల్ అప్డేట్స్ ను రెగ్యులర్ గా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇక తన కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి చేసే సందడి గురించి నెటిజన్లకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్లిద్దరూ కలిసి మోడ్రన్ డ్రెస్సుల్లో రీల్స్ చేస్తే తల్లీకూతుళ్లలా కాకుండా ఇద్దరు అక్కాచెల్లెళ్లలా కనిపిస్తారు. ఇలా ఒక పక్క పర్సనల్ ఫిట్ నెస్ చూసుకుంటూనే, మరో పక్క ఫ్యామిలీ లైఫ్ ను ఎంతో బ్యాలెన్స్డ్ గా లీడ్ చేస్తున్నారు సురేఖ వాణి.

This post was last modified on August 12, 2026 10:43 am

Share

Recent Posts

టాక్సిక్ పరిస్థితి ఎలా ఉంది గురూ

భారీ అంచనాల మధ్య కెజిఎఫ్ ని మించి ఉంటుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న టాక్సిక్ రిలీజ్ రోజు ఉదయం నుంచే…

20 minutes ago

ఇరుముడి జోరుకు పగ్గాలు అసాధ్యం

టయర్ 1 హీరోలు, ప్యాన్ ఇండియా సినిమాలకు రోజుల తరబడి హౌస్ ఫుల్స్ పడటం సహజం. కానీ వాటికి కూడా…

1 hour ago

సీఎం రేవంత్ టీంకు ఢిల్లీ నుంచి పిలుపు

అంతా ఊహించినట్టే ఢిల్లీ కాంగ్రెస్ స్పందించింది. ఇన్నాళ్లు తెలంగాణా కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను మౌనంగా గమనిస్తూ వచ్చిన అధిష్టానం…

2 hours ago

వైసీపీ ప‌రిస్థితి దారుణం… పోటీకి నేతలు ఉన్నారా?

స్థానిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ కోరుకుంటున్నారు. త‌ద్వారా.. గ‌త 2024 సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎదురైన ప‌రాభ‌వం…

4 hours ago

వైసీపీ టాప్ లీడ‌ర్‌కు జ‌గ‌న్ చెక్‌…?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ వైసీపీ రాజకీయంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత వైసీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే…

6 hours ago

మ‌హేష్ బాబుకు క‌థ చెప్పిన సుధ కొంగ‌ర‌

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మొద‌ట్నుంచి టాలీవుడ్‌కే ప‌రిమితం అయిపోయాడు కానీ.. త‌న‌కు ఇత‌ర భాష‌ల్లోనూ మంచి డిమాండే ఉంది.…

11 hours ago