Movie News

మెగా క్యాంపులో సుప్రీమ్ హీరోనే బ్యాలన్స్

కొరియన్ కనకరాజు హిట్టయిపోయింది. మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేయడంతో వరుణ్ తేజ్ సంతోషం మాటల్లో చెప్పలేం. నాలుగు డిజాస్టర్ల తర్వాత దక్కిన సక్సెస్ కావడంతో ఫ్యాన్స్ కూడా పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఇది సెలెబ్రేట్ చేసుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా వేడుక చేయబోతున్నారు. థియేటర్ బిజినెస్ రీజనబుల్ గా చేయడం వల్ల త్వరగా రికవరీకి అవకాశం దక్కింది. ఏదైతేనేం మెగా ప్రిన్స్ ఖాతాలో విజయం చేరింది. అందరూ లాభపడుతున్నారు.

దీనికన్నా ముందు జనవరిలో సంక్రాంతికి వచ్చిన మన శంకరవరప్రసాద్ గారు ఎంత బ్లాక్ బస్టరో తెలిసిందే. భోళా శంకర్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరుకి సరైన న్యాయం కలిగిస్తూ అది మూడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది. గేమ్ చేంజర్ మిగిల్చిన కొరతని రామ్ చరణ్ కు పెద్ది చాలా మటుకు తీర్చింది. బయట కాకపోయినా తెలుగు రాష్ట్రాల వరకు బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. గత ఏడాది హరిహర వీరమల్లు చేసిన గాయం పోగొట్టే స్థాయిలో పవన్ కళ్యాణ్ ఓజి ఎంత సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ దెబ్బేసినా ఫ్యాన్స్ కి మాత్రం ఓజి యుఫొరియా మనసులో ఉండిపోయింది.

ఇలా మెగా కాంపౌండ్ నుంచి ముగ్గురు హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ట్రాక్ లోకి వచ్చేశారు. నెక్స్ట్ సాయి దుర్గ తేజ్ వంతు ఉంది. రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న సంబరాల ఏటిగట్టు కోసం చాలా కష్టపడ్డాడు. నిర్మాతలు కూడా బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా భారీగా ఖర్చు చేస్తున్నారు. విడుదల తేదీ విషయంలో ఇంకా సందిగ్దత కొనసాగుతున్నప్పటికీ ఎప్పుడు వచ్చినా సుప్రీమ్ హీరోకి ప్యాన్ ఇండియా హిట్టవుతుందనే నమ్మకం టీమ్ లో కనిపిస్తోంది.

డిసెంబర్ అవకాశాలను నిర్మాతలు పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఫౌజీ, వృషకర్మ కనక అదే నెలలో వచ్చేందుకు కట్టుబడితే సంబరాల ఏటిగట్టు వచ్చే ఏడాదికి వెళ్ళిపోవాలి. కానీ అంత గ్యాప్ ఇబ్బంది కలగొచ్చు. దసరా స్లాట్స్ అన్నీ ఆల్రెడీ పెద్ద సినిమాలకు లాకైపోవడంతో సాయి తేజ్ మూవీకి చిక్కొచ్చి పడింది. కెజిఎఫ్ తరహా వరల్డ్ బిల్డింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సంబరాల ఏటిగట్టులో యాక్షన్ ఎపిసోడ్లు, నేపథ్యం చాలా గ్రాండియర్ గా ఉంటాయట. అంధుకే సాయితేజ్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. 

This post was last modified on August 10, 2026 11:05 pm

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

28 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

14 hours ago