Movie News

యష్ &  విశాల్… ఇన్ని పోలికలున్నాయా

సరిగ్గా పన్నెండు రోజుల గ్యాప్ లో విడుదల కాబోతున్న టాక్సిక్, మకుటం కొన్ని విషయాల్లో చాలా సారూప్యతలు చూపిస్తున్నాయి. మొదటిది వీటిలో యష్, విశాల్ ఇద్దరూ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేయడం. అందులోనూ ఒకరి మీద మరొకరికి పగ ఉండటమనే కామన్ పాయింట్ రెండింట్లో గమనించవచ్చు. ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్ లో ఎక్కువ క్రూరత్వాన్ని నింపడం ఇంకో అంశం కాగా, గన్నులు కత్తులు పట్టుకుని చేసే వయొలెన్స్ లో ఎవరికి వారు నువ్వా నేనాని పోటీ పడ్డారు.

టాక్సిక్, మకుటం రెండూ నేర సామ్రాజ్యం బ్యాక్ డ్రాప్ లోనే రూపొందాయి. సెంటిమెంట్, ఎమోషన్స్ పరిమిత మోతాదులోనే ఉంటాయి. క్లాస్ ఎలిమెంట్స్ కు ఎక్కువ చోటు లేదు. అయితే బడ్జెట్ పరంగా రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. యష్ ది ప్యాన్ ఇండియా మూవీ. కన్నడ, తమిళ, హిందీ, తెలుగు, మలయాళం భాషల్లో మంచి బజ్ ఉంది. కానీ మకుటం ప్రభావం రెండు భాషల్లోనే ఉంటుంది. యునానిమస్ టాక్ వస్తే ఇతర రాష్ట్రాల మార్కెట్ కి బెనిఫిట్ అవుతుంది.

ముందు ఫలితం వచ్చేది ముకుటందే. ఆగస్ట్ 14 థియేటర్లలో అడుగు పెడుతోంది. ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే మకుటంకి విశాల్ స్వీయ దర్శకత్వం వహించగా టాక్సిక్ రచన, డైరెక్షన్ లో యష్ తన వంతుగా సహాయ సహకారాలు గీతూ మోహన్ దాస్ కు అందించాడు. అంటే ఇందులో కూడా పోలికలు కలుస్తున్నాయన్న మాట. కాకపోతే యష్ కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వస్తుండగా విశాల్ ఎలాగైనా హిట్టు కొట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు.

ఏపీ తెలంగాణ వరకు చూసుకుంటే అన్ని రకాలుగా టాక్సిక్ దే పై చేయి కానుంది. విశాల్ మార్కెట్ చాలా కాలంగా మన దగ్గర డౌన్ లో ఉంది. ఒకప్పుడు పందెం కోడి, పొగరు లాంటి హిట్స్ తో మినిమమ్ గ్యారెంటీ ఉండేది కానీ తర్వాత బాగా తగ్గిపోయింది. అభిమన్యుడుతో మళ్ళీ గాడిలో పడినట్టు అనిపించినా తిరిగి కథ మళ్ళీ మొదటికే వచ్చింది. సూపర్ గుడ్ ఫిలింస్ కి మకుటం 99వ సినిమా. ఆర్బి చౌదరి చనిపోక ముందు ఓకే చేసిన స్టోరీ. అంతగా ఏముందో చూడాలంటే మూడు రోజులు ఆగాలి. 

This post was last modified on August 10, 2026 9:42 pm

Share

Recent Posts

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

52 minutes ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

1 hour ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

4 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

6 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

6 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

7 hours ago