హీరోయిన్‌కు అభిమాని లిప్ కిస్

పబ్లిక్‌లోకి వచ్చే సెలబ్రెటీలతో సామాన్య జనం కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తమ అభిమాన కథానాయకులు, కథానాయికలను చూసిపుడు ఫ్యాన్స్ ఉద్వేగంలో ఏం చేస్తున్నామన్నది మరిచిపోతుంటారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భుజానికి పెద్ద సర్జరీ చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు కారణం అభిమానుల అతి ప్రేమే అని ఆ మధ్య ఒక సందర్భంలో పవన్ చెప్పడం గుర్తుండే ఉంటుంది.

ఇటీవల అల్లు అర్జున్ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేస్తే.. ఆయన్ని కలిసినపుడు కొందరు ఫ్యాన్స్ ఎలా ప్రవర్తించారో చూశాం. ఒక అభిమాని బన్నీ మీదికెక్కి ముద్దు పెట్టేశాడు. ఇలాంటి అనుభవాలు చాలామందికి అనుభవమే. తాజాగా బాలీవుడ్ కథానాయిక నిఖిత రావల్‌కు ఒక లేడీ ఫ్యాన్ నుంచి ఊహించిన అనుభవం ఎదురైంది. ఆమెకు ఆ అభిమాని ఏకంగా లిప్ కిస్ పెట్టేసింది. ఊహించని ఈ పరిణామానికి నిఖిత అవాక్కయింది.

ఒక కార్యక్రమంలో భాగంగా నిఖిత రావల్ కెమెరాలకు పోజులు ఇస్తుండగా.. స్టేజ్ మీదికి ఒక లేడీ ఫ్యాన్ వచ్చింది. రావడం రావడంతోనే నిఖితను కౌగిలించుకుంటూ ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టింది. అంత వరకు ఓకే కానీ.. అక్కడితో ఆగకుండా నిఖితకు గట్టిగా పెదవి ముద్దు ఇచ్చేసింది. దీంతో షాకైన నిఖిత.. ఆమెను విడిపించుకునే ప్రయత్నం చేయగా.. మళ్లీ బుగ్గ మీద ముద్దు పెట్టిందా ఫ్యాన్.

ఆ అభిమాని తనను వదిలిపెట్టాక నిఖిత పెదవిని తుడుచుకుంది. నిఖిత బాలీవుడ్లో మరీ పాపులర్ హీరోయినేమీ కాదు. మిస్టర్ హాట్ మిస్టర్ కూల్, బ్లాక్ అండ్ వైట్, హీరో లాంటి చిన్న-మిడ్ రేంజ్ సినిమాల్లోనే నటించింది. మంచి డ్యాన్సర్ కూడా అయిన నిఖిత ‘అమ్మా కి బోలి’ మూవీలో ఒక ఐటెం సాంగ్ చేసింది. ఈ స్థాయి హీరోయిన్ మీద అంత అభిమానం చూపించడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే.