సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ముందే ప్రచారం జరిగినట్టు వారణాసి నుంచి ఎలాంటి టీజర్ రాలేదు. రెండు కొత్త స్టిల్స్ తో అభిమానులకు రాజమౌళి కానుకలు ఇచ్చారు. ఒక దాంట్లో ఆఫ్రికా ఎపిసోడ్ నుంచి షూట్ చేసిన మహేష్ సైడ్ లుక్ ఉండగా మరోదాంట్లో వెదురు బొంగుల పడక మీద చిరునవ్వు చిందిస్తున్న పూర్తి దర్శనం ఉంది. వీటి ద్వారా రుద్ర లుక్ ఎలా ఉంటుందనే క్లారిటీ వచ్చేసినట్టే. అయితే రాముడి వేషం మాత్రం ఇప్పుడప్పుడే రివీల్ చేసే ప్లాన్ లో లేరు.
ప్రియాంకా చోప్రా బర్త్ డేకు ఫాలో అయిన స్ట్రాటజీనే ఇప్పుడు మహేష్ కూ పాటించారు. నిజానికి ఫ్యాన్స్ వీడియో కంటెంట్ కోరుకున్నారు. కానీ షూటింగ్ కీలక దశలో ఉండటం, ఎడిటింగ్ మీద ఫోకస్ పెట్టేంత టైం జక్కన్న దగ్గర లేకపోవడం లాంటి కారణాల వల్ల దాన్ని నెరవేర్చలేకపోయారు. సినిమా రిలీజ్ ఏప్రిల్ 7 అంటే ఇంకా ఏడు నెలలే సమయమే ఉంది కాబట్టి టీమ్ ఉరుకులు పరుగులు మీద ఉంది. రిలీజ్ డేట్ ఎట్టి పరిస్థితుల్లో మార్చే ప్రసక్తే లేకుండా కష్టపడుతున్నారు.
యాభై పడిలో అడుగు పెట్టిన మహేష్ బాబు ఇప్పటికీ రాజకుమారుడు నాటి ఎనర్జీ, లుక్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. మూడు దశాబ్దాల ప్రస్థానంలో చేసింది ఇరవై తొమ్మిది సినిమాలే అయినా అశేషమైన ఫాలోయింగ్ తో కృష్ణ గారి వారసత్వాన్ని నిలబెట్టడంలో మహేష్ చేసిన కృషి చాలా ఉంది. మురారి లాంటి ఎమోషనల్ డ్రామా నుంచి పోకిరి లాంటి కమర్షియల్ ఇండస్ట్రీ హిట్ దాకా తను సాధించిన ఘనతలు అనంతమైన ఫాలోయింగ్ తెచ్చి పెట్టాయి.
వచ్చే ఏడాది పుట్టినరోజు నాటికి మహేష్ బాబు గ్లోబల్ ఆడియన్స్ కి మరింత దగ్గరై ఉంటాడు. ఆర్ఆర్ఆర్ వల్ల జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు వచ్చిన గుర్తింపు కంటే వారాణసి ద్వారా మహేష్ సంపాదించబోయే ఇమేజ్ చాలా ఎక్కువ ఉంటుందని రషెస్ చూసినవాళ్లు చెబుతున్న మాట. ఇండియానా జోన్స్ స్ఫూర్తిగా అడవుల బ్యాక్ డ్రాప్ తీసుకున్న రాజమౌళి వాటితో పాటు వివిధ దేశాల సాహస ప్రయాణాలతో పాటు రామాయణ ప్రపంచాన్ని కూడా చూపించబోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates