కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా అవి థియేట్రికల్ గా భారీ రెవెన్యూలు చూపించకపోవచ్చు. అంత మాత్రాన వాటిని ఫ్లాప్ కిందకో యావరేజ్ కిందకో పరిగణించలేం. దీవానా అదే క్యాటగిరీలో వస్తోంది. జూన్ లో విడుదలైన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా ఇటీవలే ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చింది. రెండు వారాలు తిరక్కుండానే వంద మిలియన్ నిమిషాల వ్యూస్ సాధించి ఆడియన్స్ మెప్పు పొందే పనిలో ఉంది. ప్రస్తుతం ఆ యాప్ టాప్ ట్రెండింగ్ లో ఉన్న మూవీ ఇదేనని టాక్.
తెలంగాణ అందులోనూ ప్రత్యేకంగా హైదరాబాద్ గల్లీ బ్యాక్ డ్రాప్ తీసుకున్న దర్శకుడు శ్రీకాంత్ సంఘీశెట్టి చాలా సహజంగా భావోద్వేగాల ప్రేమకథను తెరకెక్కించారు. ఇంటర్వల్ దాకా హీరోయిన్ కు సంబంధించిన ఒక ట్విస్టుని దాచిపెట్టి, ఆ తర్వాత ఆ నిజం హీరోకి తెలిసినా ఆ అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించే పాయింట్ జనాన్ని ఆకట్టుకుంది. ఏపీలో తక్కువే కానీ నైజాంలో దీవానాని బాగానే రిసీవ్ చేసుకున్నారు. పదిహేను రోజులకు పైగానే రన్ వచ్చింది.
హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేఘలై జంటగా నటించిన దీవానాలో ఫాదర్ ఎమోషన్ కూడా బలంగా దట్టించారు. జులయిగా తిరిగే ఒక యువకుడు ప్రేమలో పడ్డాక జీవితంలో ఏదైనా సాధించే స్థితికి చేరుకోవడమే కాక కన్నవాళ్ళు గర్వపడే స్థాయిని అందుకోవచ్చనే సందేశం ఈ సినిమా ద్వారా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతే కాదు ప్రాణంగా ప్రేమించడం అంటే శరీరాన్ని కాదు మనసుని అనే మెసేజ్ కూడా అంతర్లీనంగా ఈ మూవీలో వెంటాడుతూ ఉంటుంది.
దీవానా ఇప్పుడే కాదు కొన్నేళ్ల తర్వాత సోషల్ మీడియాలో అండర్ రేటెడ్ అనొచ్చు. క్లాసిక్ అని మెచ్చుకోవచ్చు. ఓటిటిలో వ్యూస్ లో అదే స్పష్టమవుతోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు డిజిటల్ లోకి వచ్చిన తర్వాత పెద్దగా అద్భుతాలు చేయలేకపోతున్నాను. పెద్దినే ఉదాహరణగా చెప్పొచ్చు. దీవానా లాంటివి థియేటర్లో మిస్ అయిన వాళ్ళు లక్షలు కోట్లలో ఉంటారు. లాయర్ గా వేణు యెల్దండి నటించిన పోలీస్ స్టేషన్ సీన్ ఎక్స్ లో బాగా వైరల్ అవుతోంది. రీచ్ పెంచుతోంది.
This post was last modified on August 8, 2026 10:12 pm
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…