Movie News

సూర్య సినిమాలో జ్యోతిక రెఫ‌రెన్స్… భ‌లే పేలిందే

సాధార‌ణంగా పెద్ద స్టార్ల సినిమాల‌కు సంబంధించిన రెఫ‌రెన్సుల‌ను చిన్న హీరోల సినిమాల్లో వాడుతుంటారు. త‌మ కుటుంబానికి చెందిన సీనియ‌ర్ల రెఫ‌రెన్సులను యంగ్ హీరోలు వాడ‌డ‌మూ మామూలే. కానీ ఒక పెద్ద స్టార్ సినిమాలో త‌న భార్య న‌టించిన మ‌రో సినిమా రెఫ‌రెన్స్ ఉప‌యోగించ‌డం మాత్రం అరుదే. 

వైవిధ్యానికి పెట్టింది పేరైన సూర్య‌.. త‌న కొత్త చిత్రం విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్‌లో త‌న భార్య జ్యోతికకు సంబంధించిన ఐకానిక్ సీన్‌ను రీక్రియేట్ చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. ఆగ‌స్టు 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి శుక్ర‌వార‌మే ట్రైల‌ర్ లాంచ్ చేశారు. ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగిన ట్రైల‌ర్ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకుంది. మ‌నుషులు విడిపోయేది గొడ‌వ వ‌ల్ల కాదు, గొడ‌వ త‌ర్వాత ఎలా మాట్లాడాలో తెలియ‌క అంటూ సూర్య చెప్పిన డైలాగ్ ట్రైల‌ర్లో హైలైట్.   ఇక ట్రైల‌ర్ చివ‌ర్లో జ్యోతిక ప్ర‌స్తావ‌న రావ‌డం కొస‌మెరుపు అని చెప్పొచ్చు.

పిల్లాడు ఆడుకునే కార్ల‌లో మోడ‌ల్స్ గురించి చూపిస్తూ సూర్య ఎగ్జైట్ అవుతుంటే.. ఎందుకు చంద్ర‌ముఖిలో జ్యోతిక లాగా ఓవ‌ర్‌గా రియాక్ట‌వుతున్నావు అంటూ మామిత బైజు చెప్పిన డైలాగ్ భ‌లేగా పేలింది. చంద్ర‌ముఖి మూవీలో గంగ పాత్ర‌లో జ్యోతిక ఎంత గొప్ప పెర్ఫామెన్స్ ఇచ్చిందో తెలిసిందే. అందులో మిగ‌తా సీన్ల‌న్నీ ఒకెత్త‌యితే.. చంద్ర‌ముఖి న‌గ‌ల్ని అలంక‌రించుకుంటూ గంగ ఉద్వేగానికి గుర‌య్యే సీన్ మ‌రో ఎత్తు. 

క‌ల్ట్ స్టేట‌స్ తెచ్చుకున్న ఈ స‌న్నివేశాన్ని సూర్య సినిమాలో పెట్టాల‌న్న వెంకీ అట్లూరి ఆలోచ‌న సూప‌ర్. ఇందులో సూర్య ప్ర‌మేయం ఎంత ఉందో కానీ.. అభిమానుల‌కు మాత్రం ఈ సీన్ చూసి ముచ్చ‌ట‌గా అనిపిస్తోంది. విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఇటీవ‌ల సూర్య‌ త‌న భార్య జ్యోతిక‌తో క‌లిసి ఇచ్చిన ఇంట‌ర్వ్యూ కూడా వైర‌ల్ అయింది. అందులో వాళ్లిద్ద‌రూ ఒక‌రినొక‌రు గౌర‌వించుకున్న తీరు.. వారి మ‌ధ్య కెమిస్ట్రీ అంద‌రినీ అమితంగా ఆక‌ట్టుకుంది.

This post was last modified on August 9, 2026 9:14 am

Share

Recent Posts

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

38 minutes ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

47 minutes ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

2 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

2 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

3 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

6 hours ago