Movie News

ట్రైలర్ల జాతర… విజేత ఎవరు దొర

ఈ వారం భారీ సినిమాల ట్రైలర్లు వరసగా రోజుకొకటి సందడి చేశాయి. అన్నీ పెద్ద అంచనాలు పెట్టుకున్న చిత్రాలు కావడంతో ప్రేక్షకులతో పాటు బిజినెస్ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూశాయి. స్టార్ హీరోలు, అందులోనూ ఒకదానితో మరొకటి సంబంధం లేని జానర్లు కావడంతో భవిష్యత్ లో ఇవి రిలీజైనప్పుడు జనాల స్పందన ఎలా ఉంటుందనే దాని మీద రకరకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ నాలుగు ప్యాన్ ఇండియా మూవీస్ గురించి.

మొదటిది రామాయణ. నాలుగు వేల కోట్లతో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ తాలూకు ట్రైలర్ కు టీజర్ కంటే మంచి రెస్పాన్స్ రావడం నిర్మాతలకు ఊరట కలిగిచింది. అయితే విఎఫెక్స్ కోటింగ్ మరీ ఎక్కువైపోయిందనే కోణంలో కొన్ని నెగటివ్ కామెంట్స్ లేకపోలేదు. ఎమోషన్, డివోషన్ ని దర్శకుడు నితేశ్ తివారి ఏ మేరకు బ్యాలన్స్ చేశారనేది నవంబర్ 8 థియేటర్స్ లో చూస్తే కానీ క్లారిటీ రాదు. దేశమంతా ఊగిపోయే లెవెల్ లో ఎగ్జైట్ మెంట్ అయితే ఇది కలిగించలేదు.

రెండోది టాక్సిక్. విపరీతమైన వాయిదాలు, కంట్రోల్ తప్పిన బడ్జెట్లు అన్నీ దాటుకుని నాలుగు నిమిషాలకు పైగా ఉన్న లెన్తీ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. వయొలెన్స్ ఏ స్థాయిలో ఉంటుందో చాలా శాంపిల్స్ చూపించారు. కెజిఎఫ్, యానిమల్ స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ హీరో యష్ ని మూడు షేడ్స్ లో ఎలా ప్రెజెంట్ చేసి ఉంటారనే దాని మీద సక్సెస్ ఆధారపడి ఉంటుంది. టీజర్ టైంలో వచ్చిన నెగటివిటీ ఇప్పుడు తగ్గిందనే చెప్పాలి.

ఇక మూడోది ది ప్యారడైజ్. ఇది ట్రైలర్ లిస్టులో చేర్చేది కాకపోయినా హైప్ దృష్ట్యా దీని మీద కూడా కోట్లాది కళ్లున్నాయి. ఫీడ్ బ్యాక్ ఆధారంగా నాని డబ్బింగ్ ని సరిచేయడం మంచి పని. మరీ వేగంగా టీజర్ కట్ చేయడంతో సామాన్య ప్రేక్షకులకు కథ దేని గురించో పూర్తి క్లారిటీ రాలేదు. ఇంకొంత కాలం వెయిట్ చేయాలి. చివరిది విశ్వనాథ్ అండ్ సన్స్. విజువల్ గ్రాండియర్ కాకపోయినా ఫ్యామిలీ అండ్ లవ్ యాంగిల్ ని కొత్తగా ఆవిష్కరించేందుకు ట్రై చేస్తున్న వెంకీ అట్లూరి ఒక టిపికల్ పాయింట్ ని క్లాస్ మాస్ మెచ్చుకునేలా ఎలా హ్యాండిల్ చేశారో వచ్చే వారం తేలనుంది. ఫైనల్ గా చెప్పాలంటే ట్రైలర్ల రేసులో అందరికీ సమాన పాయింట్లే వచ్చాయని చెప్పాలి. 

This post was last modified on August 8, 2026 10:37 pm

Share

Recent Posts

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

27 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

3 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

6 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

11 hours ago