Movie News

మహేష్ అభిమానులకు దూకుడే దిక్కు

రేపు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. అభిమానులు ఎప్పటిలాగే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఎలాగూ వారణాసి విడుదల ఏప్రిల్ లోనే కాబట్టి ఈసారి దాని టీజర్ తో రచ్చ చేద్దామనుకున్నారు. కానీ దాని స్థానంలో కేవలం రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు మాత్రమే రిలీజ్ చేస్తారని తెలియడంతో కొంత నిరాశపడ్డారు. ఎందుకంటే నెక్స్ట్ బర్త్ డేకల్లా వారణాసి రిలీజ్ అయిపోయి ఉంటుంది. అందుకే రాజమౌళి ఈసారే ఏదైనా కానుక ఇవ్వాలని కోరుకున్నారు.

అదింక జరిగే పని కాదని అర్థమైపోవడంతో ఫ్యాన్స్ ఫోకస్ ఇప్పుడు దూకుడు రీ రిలీజ్ మీదకు వెళ్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్ టైనర్ 2011లో ఎలాంటి రికార్డులు సృష్టించిందో ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా మహేష్ కామెడీ టైమింగ్, బ్రహ్మానందం క్యారెక్టర్, ఏంఎస్ నారాయణ విశ్వరూపం, వీటికి తోడు తమన్ సంగీతం కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మ్రోగించాయి. అందుకే రీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురు చూస్తూ వచ్చారు.

ఎలాగూ వారణాసి నుంచి స్పెషల్ వీడియో ఏదీ లేదు కాబట్టి దూకుడు తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. బుకింగ్స్ బాగానే ఉన్నాయి. హైదరాబాద్ ఉదయం షోలు దాదాపు ఫుల్ అయిపోగా ఏపీ తెలంగాణ బిసి సెంటర్స్ లోనూ ఆక్యుపెన్సీలు బాగున్నాయి. గత ఏడాది సరిగ్గా ఇదే సమయంలో అతడు భారీ ఎత్తున పునః విడుదల చేశారు. అయితే ఊహించని విధంగా ఖలేజా, పోకిరి, మురారి స్థాయిలో అతడుకి రెస్పాన్స్ కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరి ఇప్పుడు దూకుడు ఏం చేస్తుందో చూడాలి. ఇక వారణాసి సంగతికి వస్తే రేపటి పోస్టర్లలో మరోసారి విడుదల తేదీని నొక్కి వక్కాణించబోతున్నారు. వాయిదాలు వేసుకునే ఉద్దేశంలో రాజమౌళి అసలు లేరట. ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం జరుగుతుండటంతో పోస్ట్ పోన్ గురించి ఫ్యాన్స్ టెన్షన్ పడనక్కర్లేదు. ఏప్రిల్ 7 ఈ విజువల్ గ్రాండియర్ ని చూడటం ఖాయం. ఆలోగా లెక్కలేనన్ని అప్డేట్స్, ప్రమోషన్లతో జనవరి నుంచి జనాన్ని ఊపేయడానికి వారణాసి టీమ్ రెడీ అయ్యిందట. 

This post was last modified on August 8, 2026 5:03 pm

Share

Recent Posts

249 కొట్టినా గెలవలేని టీం ఇండియా

టీ20 మ్యాచ్‌లో 249 పరుగులు చేస్తే గెలుపు దాదాపు ఖాయమని అనుకుంటాం. కానీ వెస్టిండీస్ బ్యాటర్లు ఆ అంచనాలను తలకిందులు…

43 minutes ago

బ్లాక్ బస్టర్ మనకెందుకు నచ్చడం లేదంటే

కన్నడలో గత నెల 25 ప్యారడైజ్ తో పాటుగా విడుదలైన ప్రేమద ఊరల్లీ భీభత్సమైన కలెక్షన్లతో కర్ణాటకలో అదరగొడుతోంది. రెండో…

2 hours ago

అష్ట‌దిగ్భంధ‌నంలో దేశ రాజధాని

వైద్య విద్య ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించిన నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు సంబంధించి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేసిన నిర‌స‌న…

3 hours ago

తెలంగాణ హీరో రాయలసీమ యాస పేలిందా

ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…

3 hours ago

కొత్త ప్రభుత్వాలు బలంగానే ఉన్నాయి

తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న పార్టీలే హ‌వా చూపించాయి.…

3 hours ago

బీసీ రిజర్వేషన్ల విషయంలో తగ్గేదెలే అంటున్న చంద్రబాబు

బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…

4 hours ago