Movie News

కనకం కురిపిస్తున్న కొరియన్ దెయ్యం

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెద్ద రిలీఫ్ ఫీలవుతున్నాడు. వరస డిజాస్టర్లతో ఏకంగా కెరీర్ నే రిస్క్ లో పెట్టుకున్న ఈ మెగా హీరోకి కొరియన్ కనకరాజు రూపంలో మంచి విజయం ఖాతాలో చేరింది. ఇంకా రెండో రోజే కాబట్టి అప్పుడే ఫైనల్ స్టేటస్ నిర్ణయించలేం. అయితే మొదటి రోజు పది కోట్ల దాకా గ్రాస్ సాధించడం, రెండో రోజు బుకింగ్స్ ప్రామిసింగ్ గా ఉండటం, గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చూస్తుంటే ఆక్యుపెన్సీలు ఎంత బలంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

కమెడియన్ సత్య పాత్ర, అమెచ్యూరిష్ అంటూ సోషల్ మీడియాలో జరిగిన హడావిడి. అధిక శాతం నుంచి చూడొచ్చనే పాజిటివ్ టాక్ ఇవన్నీ కలిసి జనం బాగానే థియేటర్లు వెళ్తున్నారు. పోటీలో ఉన్న ఇతర సినిమాలు పబ్లిసిటీ, కంటెంట్ విషయంలో దీని కన్నా వెనుకబడి ఉండటం యువి సంస్థ నిశ్చింతగా ఉంది. చాలా చోట్ల స్క్రీన్లు యాడ్ చేస్తున్న వైనం స్పష్టం. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకా రెండో వారంలోనే ఉండటం వల్ల మల్టీప్లెక్సు షోల అడ్జస్ట్ మెంట్ కొంత ఇబ్బందిగా మారింది.

సోమవారంలోపే బ్రేక్ ఈవెన్ దాటిపోయే లక్షణాలు కొరియన్ కనకరాజుకి పుష్కలంగా ఉన్నాయి. మెయిన్ సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడుతున్నాయి. వరుణ్ తేజ్ ఈ బోర్డు చూసి ఎంత కాలమయ్యిందో వెంటనే చెప్పడం కష్టం. హాస్యం పరంగా సత్య డామినేషన్ ఎక్కువగా ఉన్నప్పటికీ గ్యాంగ్ స్టర్ వేషంలో, అనంతపురం కుర్రాడి పాత్రలో వరుణ్ తేజ్ ఇచ్చిన షేడ్స్ మాస్ జనాలను బాగానే ఆకట్టుకున్నాయి. తమన్ నుంచి అవుట్ స్టాండింగ్ సాంగ్స్ లేకపోవడం ఒకటే కొంత లోటు.

ఫైనల్ థియేటర్ రన్ అయ్యేలోపు యాభై కోట్ల గ్రాస్ అందుకుంటుందనే నమ్మకం ట్రేడ్ లో కనిపిస్తోంది. ఇదేమి అసాధ్యం కాదు. చెన్నై లవ్ స్టోరీ, మా ఇంటి బంగారం, లెనిన్ చాలా ఈజీగా ఆ మైలురాయిని దాటేశాయి. కొరియన్ కనకరాజుకి ఆ ఛాన్స్ పుష్కలంగా ఉంది. వచ్చే వారం టఫ్ కాంపిటీషన్ ఇచ్చే సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఆలోగానే వీలైనంత రికవరీ చేసుకోవాలి. ఒక విషయంలో ఈ టీమ్ ని మెచ్చుకోవాలి. నిత్యం ఫోకస్ ఉండేలా చేసిన ప్రచారాలు బాగా ఉపయోగపడుతున్నాయి. 

This post was last modified on August 8, 2026 4:42 pm

Share

Recent Posts

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

1 hour ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

1 hour ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

1 hour ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago

వైసీపీకి మ‌రో షాక్ త‌ప్ప‌దా.. !

ఏపీ ప్ర‌తిప‌క్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చూసింది ఒక లెక్క‌.. ఇక నుంచి మ‌రో…

8 hours ago

డీజే దెబ్బకు ఆగిన గుండె.. అసలేంటీ డీజే?

ప్ర‌స్తుతం ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన 'డీజే సౌండ్‌' వ్య‌వ‌హారం.. కీల‌క మ‌లుపు తిరిగింది. తాజాగా అనంత‌పురంలో నిర్వ‌హించిన వినాయ‌క నిమ‌జ్జ‌న…

9 hours ago