బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక విచిత్రమైన క్లాష్ మొదలైంది. ఒకే రోజు, వేర్వేరు మేకర్స్ నుంచి ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యాయి. ఆ పేరే రాంబోలా. దర్శకులు, నిర్మాతలు వేరైనా రెండింటి సోల్ ఒక్కటే. హిందూ సనాతన ధర్మంలో ఎంతో విశిష్ట స్థానం ఉన్న గోస్వామి తులసీదాస్ బయోపిక్ తెరకెక్కించేందుకు రెండు టీమ్స్ ఒకేసారి రంగంలోకి దిగాయి.
ఇందులో ఒక రాంబోలాను విశాల్ చతుర్వేది డైరెక్ట్ చేస్తుండగా, ప్రముఖ ప్రొడ్యూసర్ మహవీర్ జైన్ నిర్మిస్తున్నారు. సరిగ్గా అదే టైమ్‌లో సీనియర్ డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది సైతం అదే పేరుతో తన ప్రాజెక్ట్‌ను బయటపెట్టారు. గతంలో సామ్రాట్ పృథ్వీరాజ్, మొహల్లా అస్సీ లాంటి చిత్రాలు తీసిన ఈయన సినిమాకు మధు మంతెన నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇద్దరు పేరున్న దర్శకులు ఒకేసారి తులసీదాస్ కథపై పడటంతో బీటౌన్‌లో పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ రెండు టీమ్స్ రాంబోలా పేరునే ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. పురాణాల ప్రకారం గోస్వామి తులసీదాస్‌కు చిన్నతనంలో ఉన్న ముద్దుపేరు రాంబోలా. పుట్టగానే ఆయన రాముడి నామం పలకడంతో ఆ పేరు పెట్టారట. దీంతో ఈ బయోపిక్‌కు ఇంతకంటే పర్ఫెక్ట్ టైటిల్ ఉండదని ఇద్దరు డైరెక్టర్లు ఫిక్స్ అయ్యారు. కానీ టైటిల్ రిజిస్ట్రేషన్ అసలు రైట్స్ ఎవరి చేతిలో ఉన్నాయి, చివరకు ఎవరు పేరు మార్చుకుంటారనేది అసలు సస్పెన్స్.
కథ ఒక్కటే అయినా ట్రీట్‌మెంట్ కచ్చితంగా వేరుగా ఉండే ఛాన్స్ ఉంది. తులసీదాస్ జీవితంలో బాల్యపు కష్టాలు, సన్యాస ప్రయాణం, రామచరితమానస్ రచన లాంటి ఎన్నో కోణాలున్నాయి. విశాల్ తనదైన కమర్షియల్ యాంగిల్‌లో కథను నడిపిస్తారా లేక చంద్రప్రకాశ్ ద్వివేది తన స్టైల్‌లో సీరియస్ పీరియాడిక్ డ్రామాగా తీర్చిదిద్దుతారా అనేది చూడాలి. నటీనటులు ఎవరనేది తేలితే ప్రాజెక్ట్‌ల రేంజ్ అర్థమవుతుంది.
ప్రస్తుతానికి రెండు పోస్టర్లు మాత్రమే బయటకు వచ్చాయి. మెయిన్ లీడ్ చేసేది ఎవరు, షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ముందుగా ఎవరు సెట్స్ పైకి వెళ్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on September 19, 2026 8:07 am
కొన్ని సినిమాలకు కొనసాగింపులు సులభం కాదు. ఏదో జనాల్లో క్రేజ్ ఉంది కదాని, సోషల్ మీడియాలో హైప్ ఉంది లెమ్మని…
సినిమాల సెన్సార్షిప్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఈ మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో…
వందేళ్ల క్రితం సైమన్ ను రక్షించడానికి ప్రయత్నించిన బ్రిటీష్ ప్రభుత్వం కుప్పకూలిపోయిందని, ఇప్పుడు జ్ఞానేష్ కుమార్ ను రక్షించాలని ప్రయత్నం…
వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి సగటు రాజకీయ నాయకుడి నుంచి మతపరమైన రాజకీయాలు చేసి…
కాకా జనవరిలో సంక్రాంతి పండక్కు వచ్చేస్తుంది. తక్కువ గ్యాప్ లో విశ్వంభర దిగుతుంది. తర్వాత ఎవరితో సినిమా ఉంటుందనేది చిరంజీవి…
బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు నానా పటేకర్ కన్ను మూయడం ఇండస్ట్రీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. 75 వయసులో చివరి…