Political News

స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే కన్నుమూత

తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ఆయన సొంత నియోజకవర్గం కొళత్తూరులో ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారు. ఆయన మరణంతో టీవీకే శ్రేణుల్లో విషాదం నెలకొంది.

సెప్టెంబర్ 9న శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన బాబుకు అప్పటి నుంచి చికిత్స కొనసాగుతోంది. దాదాపు 70 రోజుల పాటు వైద్యులు ప్రయత్నించినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. చివరకు నవంబర్ 19న ఆయన తుదిశ్వాస విడిచారు.

2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొళత్తూరు నుంచి పోటీ చేసిన వీఎస్ బాబు, స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2011 నుంచి వరుసగా ఈ నియోజకవర్గంలో విజయం సాధిస్తున్న స్టాలిన్‌కు బాబు ఓటమి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగా నిలిచింది.

ఇప్పుడు బాబు మరణంతో కొళత్తూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే తమిళనాడులో మరో ఐదు అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉండటంతో రాబోయే ఉప ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.

మరి ఈ ఉప ఎన్నికలో స్టాలిన్ మళ్లీ కొళత్తూరు నుంచి పోటీ చేస్తారా? లేక మరో అభ్యర్థిని బరిలోకి దించుతారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే స్టాలిన్ పోటీపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

వీఎస్ బాబు గతంలో డీఎంకేలో ఉండి 2006లో పురసైవాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో చేరి, 2026 ఫిబ్రవరిలో విజయ్ నేతృత్వంలోని టీవీకేలోకి వచ్చారు. కొద్ది నెలల క్రితమే స్టాలిన్‌ను ఓడించి వార్తల్లో నిలిచిన బాబు మరణం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on November 19, 2026 4:18 pm

Share

Recent Posts

వింటేజ్ సినిమాలను వృథా చేయకండి

పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…

49 minutes ago

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే… మంత్రి పదవి ఫిక్స్

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు…

53 minutes ago

జ‌న్‌జీకి మోడీ క‌నెక్ట్‌… ఐడియా అదుర్స్!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌త మూడు నెల‌ల నుంచి జ‌న్‌జీ(యువ‌త‌)కి క‌నెక్ట్ అయ్యేలా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాక్రోచ్…

1 hour ago

సాయిరెడ్డి చెప్పింది నిజ‌మేనా.. ?

ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…

1 hour ago

గాడ్జిల్లా గల్లంతు అయ్యేలా ఉంది

తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…

4 hours ago

హమ్మయ్య… తుఫాన్ ముప్పు తప్పినట్టేనా?

నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…

5 hours ago