ఈ మధ్యకాలంలో భారతీయులపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం బాగా ఎక్కువైంది. విలాసవంతమైన జీవితం, మద్యపానం, ఖరీదైన భోజనం వంటి వాటిని స్టేటస్ సింబల్స్ గా చాలామంది చూస్తున్నారు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు… ఈ రోజు ఎంజాయ్ చేయడమే అన్నరీతిలో చాలామంది ప్రజలు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా జెన్ జీ యువత..మళ్లీ పుడతామా ఏంటి..అంటూ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మన సంస్కృతి గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
తినడం, తాగడం, విలాసంగా ఉండటం అనేది భారతీయ సంస్కృతి కాదని మోదీ అన్నారు. భారతీయ సాంప్రదాయ విలువలు వినియోగానికి బదులుగా పొదుపును ప్రోత్సహిస్తాయని చెప్పారు. కేవలం సంపాదించి ఖర్చు చేయడమే జీవితం కాదని, భవిష్యత్ అవసరాలకు పొదుపు చేయడం చాలా ముఖ్యమని పిలుపునిచ్చారు.
పేదరికం నుంచి సుమారు 50 కోట్ల మంది ప్రజలు బయటపడ్డారని, వారు తిరిగి పేదరికంలోకి వెళ్లకుండా కాపాడటమే అసలైన సవాల్ అని చెప్పారు. పొదుపుతోనే ఆ సవాల్ ను అధిగమించగలమన్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి పథకాల ద్వారా ప్రజలను బ్యాంకింగ్, పొదుపు వ్యవస్థలోకి తీసుకువచ్చామని తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భేటీలో కేంద్ర మంత్రులు, కార్యదర్శులను ఉద్దేశించి ఆయన పొదుపుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ముడి చమురు ధరలు, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఇంధనం, ఖర్చుల విషయంలో పొదుపు చర్యలపై,10 పొదుపు సూత్రాలపై గతంలో కూడా మోదీ పొదుపు అంశంపై పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పొదుపు మంత్రంపై విపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన పొదుపు గురించి, తిండి, మద్యపానం, దుబారా ఖర్చుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వీటిపై విపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా… ‘తిన్నామా..పడుకున్నామా..తెల్లారిందా’: అనే రీతిలో మోదీ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి.
This post was last modified on November 19, 2026 4:21 pm
పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…
సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గత మూడు నెలల నుంచి జన్‌జీ(యువత)కి కనెక్ట్ అయ్యేలా పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాక్రోచ్…
ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…
తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…
నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…