Movie News

ఇంటర్వ్యూలో హీరోయిన్‌కు అల్లు వారి సర్ప్రైజ్

ఈ శుక్రవారం రిలీజవుతున్న దుల్కర్ సల్మాన్ తెలుగు మూవీ ‘ఆకాశంలో ఒక తార’తో కథానాయికగా పరిచయం అవుతున్న సాత్విక వీరవల్లి గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. ఒక తెలుగమ్మాయి కథానాయిక ప్రాధాన్యమున్న ఇలాంటి క్రేజీ మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేయడం, ఆమె మీద నిర్మాత అల్లు అరవింద్ సహా టీం అంతా ప్రశంసల జల్లు కురిపించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమాకు ఎవరైనా స్టార్ హీరోయిన్ని పెట్టుకుందామని అనుకున్నామని, కానీ సాత్విక పెర్ఫామెన్స్ చూశాక మతిపోయిందని, ఆమె టాలెంట్ అర్థమై రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకున్నానని చెప్పారు. అరవింద్ ఊరికే ఎవరి గురించీ ఇలా గొప్పలు చెప్పే రకం కాదు. కాబట్టే సాత్విక పెర్ఫామెన్స్ విషయంలో అందరూ భారీ అంచనాలే పెట్టుకున్నారు.

కాగా సాత్వికతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ అయితే చేసుకున్నట్లు చెప్పారు కానీ, అవి ఏ చిత్రాలు అన్నది వెల్లడించలేదు అరవింద్. ఐతే దుల్కర్, సాత్వికలతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో అరవింద్ అందులో ఒక ప్రాజెక్టు గురించి వెల్లడించి సాత్వికకు స్వీట్ షాక్ ఇచ్చారు. అక్కినేని నాగచైతన్యకు జోడీగా సాత్వికను పెడుతున్న విషయం ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ విషయంలో సాత్వికకు కూడా తెలియదట. ఈ ఇంటర్వ్యూలోనే దీని గురించి తొలిసారి బయటపెట్టడంతో ఆమె షాకయ్యారు. యాంకర్ సుమతో పాటు హీరో దుల్కర్ కూడా ఆమెకు ఈ ఛాన్స్ విషయంలో కంగ్రాట్స్ చెబితే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.

త్వరలోనే ‘వృషకర్మ’ చిత్రంతో పలకరించబోతున్న చైతూ.. దీని తర్వాత ‘బెదురులంక’ దర్శకుడు క్లాక్స్‌తో జట్టు కట్టనున్న సంగతి తెలిసిందే. అది చైతూ 25వ సినిమా కావడం విశేషం. ఇంతకుముందు చైతూకు ‘100 పర్సంట్ల లవ్’, ‘తండేల్’ చిత్రాలతో పెద్ద హిట్లు ఇచ్చిన అరవింద్.. మూడోసారి అతడితో జట్టు కడుతున్నాడు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్టులో సాత్వికకు ఛాన్స్ రావడం అంటే పెద్ద విషయమే.

This post was last modified on November 19, 2026 4:52 pm

Share

Recent Posts

వింటేజ్ సినిమాలను వృథా చేయకండి

పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…

4 hours ago

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే… మంత్రి పదవి ఫిక్స్

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు…

4 hours ago

జ‌న్‌జీకి మోడీ క‌నెక్ట్‌… ఐడియా అదుర్స్!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌త మూడు నెల‌ల నుంచి జ‌న్‌జీ(యువ‌త‌)కి క‌నెక్ట్ అయ్యేలా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాక్రోచ్…

4 hours ago

సాయిరెడ్డి చెప్పింది నిజ‌మేనా.. ?

ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…

4 hours ago

గాడ్జిల్లా గల్లంతు అయ్యేలా ఉంది

తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…

7 hours ago

హమ్మయ్య… తుఫాన్ ముప్పు తప్పినట్టేనా?

నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…

8 hours ago