Movie News

హీరో బ్రదర్… సైలెంటుగా దూసుకెళ్తున్నాడు

ఒక హీరో మంచి పేరు సంపాదించి, ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటే.. తన కుటుంబంలో సినిమా ఆసక్తి ఉన్న మిగతా వాళ్లు కూడా ఇండస్ట్రీలోకి వచ్చే ప్రయత్నం చేయడం మామూలే. పెద్ద సినీ కుటుంబాల్లో ఇలా చాలామందే ఉన్నారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి వచ్చి నిలదొక్కుకున్న వాళ్లు కూడా తమ వాళ్లను సినిమాల్లోకి తీసుకొస్తుంటారు. విజయ్ దేవరకొండ అండతో ఆనంద్ దేవరకొండ అలాగే హీరో అయ్యాడు. కానీ అతను పెద్దగా విజయాలందుకోలేకపోయాడు. ఇంకా స్ట్రగలువుతూనే ఉన్నాడు. 

మరో టాలెంటెడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సోదరుడు చైతూ జొన్నలగడ్డ సైతం నటనలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాకపోతే తమ్ముడిలా హీరో అయ్యే ప్రయత్నం చేయలేదు. అలాగే తమ్ముడి పేరును కూడా చైతూ పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. చాన్నాళ్ల పాటు అతను సిద్ధు అన్నయ్య అనే విషయం కూడా జనాలకు తెలియలేదు.

అంతకుముందే కొన్ని పాత్రలు చేసినప్పటికీ.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాలో నెగెటివ్ రోల్‌తో చైతూకు మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా తర్వాత అతను చూస్తుండగానే బిజీ అయిపోయాడు. ఈ శుక్రవారం రిలీజవుతున్న రెండు బహు భాషా చిత్రాల్లో చైతూ కీలక పాత్రలు చేయడం విశేషం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’తో పాటు ధనుష్ మూవీ ‘ఓం’లోనూ చైతూ నటించడం విశేషం. ఒకే రోజు రిలీజవుతున్న ఈ రెండు క్రేజీ చిత్రాల్లో చైతూ పాత్రలు క్లిక్ అయితే తన రేంజ్ మారిపోవడం ఖాయం.

మరోవైపు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న ‘యల్లమ్మ’లో మెయిన్ విలన్ పాత్ర చేస్తోంది చైతూనేనట. ఇది చాలా స్పెషల్ రోల్ అని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఆ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మొత్తానికి తన టాలెంటుతో చైతూ నటుడిగా పెద్ద రేంజికే వెళ్లేలా కనిపిస్తున్నాడు. 

This post was last modified on November 19, 2026 4:54 pm

Share

Recent Posts

వింటేజ్ సినిమాలను వృథా చేయకండి

పాత క్లాసిక్స్ రీ రిలీజ్ చేయడం మంచి ఆలోచన. ఇప్పటి తరం వాటిని ఆస్వాదించడమే కాకుండా సదరు వింటేజ్ సినిమాల…

4 hours ago

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే… మంత్రి పదవి ఫిక్స్

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి. గెలిచిన ఆ ఎమ్మెల్యేకి బ్రహ్మాండమైన మంత్రి పదవి ఇచ్చే పూచి నాది అన్నారు…

4 hours ago

జ‌న్‌జీకి మోడీ క‌నెక్ట్‌… ఐడియా అదుర్స్!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గ‌త మూడు నెల‌ల నుంచి జ‌న్‌జీ(యువ‌త‌)కి క‌నెక్ట్ అయ్యేలా ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాక్రోచ్…

4 hours ago

సాయిరెడ్డి చెప్పింది నిజ‌మేనా.. ?

ఏపీ రాజకీయాల్లో ఇటీవల 'పరివర్తన రాజనీతి పార్టీ` (పీఆర్‌పీ) పేరుతో ఒక కొత్త రాజకీయ పార్టీని మాజీ ఎంపీ వి.…

4 hours ago

గాడ్జిల్లా గల్లంతు అయ్యేలా ఉంది

తెలుగు ప్రేక్షకులు ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార, ఓమ్ అంటూ కొత్త సినిమాల హడావిడిలో పడిపోయారు…

7 hours ago

హమ్మయ్య… తుఫాన్ ముప్పు తప్పినట్టేనా?

నిన్నటి వరకు భయపెట్టిన అక్వాన్ తుఫాన్ ఒడిశా వైపు మెల్లగా జారుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు తుఫాన్ ముప్పు తప్పింది.…

8 hours ago