తెలుగులో గత కొన్నేళ్లలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రాల్లో ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ ఒకటి. ఎక్కువగా అగ్రెసివ్ క్యారెక్టర్లు చేసే విశ్వక్సేన్‌ను పెళ్ళి కోసం తపన పడే ఒక మామూలు కుర్రాడిగా చూపించిన ఈ చిత్రం యువతకే కాదు, కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. ఈ చిత్రంలో అతడికి జోడీగా రుక్సర్ ధిల్లాన్, రితిక నాయక్ నటించారు. ఐతే ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ రిలీజయ్యే వరకు అందులో ఇంకో హీరోయిన్ ఉన్నట్లే తెలియదు. రుక్సర్‌నే కథానాయిక అనుకున్నారు. ప్రమోషన్లలో ఆమే కనిపించింది.
సినిమా చూస్తున్నపుడు కూడా మొదట రితిక హీరోయిన్ అనిపించదు. సహాయ పాత్రలా ఉంటుంది. కానీ క్రమంగా ఆ పాత్రే హైలైట్ అవుతూ వెళ్తుంది. సినిమా పూర్తయ్యేసరికి ఆ పాత్రకు భలే ఎలివేషన్ ఉంటుంది. రిలీజ్ తర్వాత రితికకు మంచి పేరు కూడా వచ్చింది.
ప్రమోషన్లలో కనిపించనివ్వకుండా, ప్రోమోల్లో కూడా హైలైట్ కాకుండా ఈ హీరోయిన్ని ఇలా దాచి ఉంచడం బాగా వర్కవుట్ అయింది. ఐతే టీం వ్యూహాత్మకంగా చేసిన ఈ పని తనను బాధ పెట్టినట్లు రితిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను తెలుగులో నటించిన తొలి చిత్రం ప్రమోషన్లలో పాల్గొనకపోవడం పట్ల తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పింది.
‘‘అశోక వనంలో అర్జున కళ్యాణం రిలీజ్ టైంలో టీం అంతా ప్రమోషన్లలో పాల్గొంది. అందులో నేను లేకపోవడం చాలా బాధగా అనిపించింది. టీం వ్యూహాత్మకంగా ఆ పని చేసి ఉండొచ్చు. కానీ నాకు లేక లేక ఒక ఛాన్స్ వచ్చి ఒక పాత్ర చేస్తే.. నా మొదటి సినిమా ప్రమోషన్లలో నేను లేకపోవడంతో తట్టుకోలేకపోయాను. నా ఫ్రెండుకు ఫోన్ చేసి దీని గురించి బాధపడ్డాను. కానీ సినిమా రిలీజయ్యాక అందరూ నా గురించి మాట్లాడుకున్నారు. మంచి పేరొచ్చింది. అప్పుడే టీం నన్ను దాచి ఉంచడం నా మంచికే అని అర్థమైంది. కొన్నిసార్లు ఓర్పుతో ఉండడం వల్ల కూడా మంచి ఫలితం వస్తుందని తెలుసుకున్నాను’’ అని రితిక చెప్పింది.
ఈ సినిమా తర్వాత రితికకు మంచి మంచి అవకాశాలే వచ్చాయి. తేజ సజ్జతో కలిసి చేసిన ‘మిరాయ్’ పెద్ద హిట్ కాగా.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు జోడీగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on July 30, 2026 7:08 pm
భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…
వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
తన చేతికి గాయం అయింది సర్జరీ చేసుకుంటున్నా అంటూ కొన్ని నెలల ముందు షాకింగ్ అప్‌డేట్ ఇచ్చి సైలెంట్ అయిపోయాడు…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…