Political News

చంద్రబాబు అన్నం తింటున్నాడా.. గడ్డి తింటున్నాడా: జగన్

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ యాక్సిడెంట్ చేయడంతో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, తన కొడుకు ఆరవ్ ను తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది.

దీంతో, రిమాండ్ లో ఉన్న అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ ఈ రోజు శ్రీకాకుళంలో పర్యటించారు. అయితే, జగన్ రోడ్ షో చేసుకుంటూ జైలు వద్దకు చేరుకునే సరికి ములాఖత్ సమయం అయిపోయింది. దీంతో, జైలు దగ్గర కాసేపు నాటకీయ పరిణామాల అనంతరం బెయిల్ పై విడుదలైన ఆరవ్, అప్పల రాజు సతీమణిని జగన్ పరామర్శించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ యథా ప్రకారం పిల్లాడు ఆరవ్ తెలియక యాక్సిడెంట్ చేస్తే మర్డర్ కేసు పెడతారా అంటూ పాత పాటే పాడారు. ఈ పిల్లాడి జీవితాన్ని నాశనం చేయాలని చూశారని, ఇదేం ప్రభుత్వంమని ప్రశ్నించారు.

ఇక, సీఎం చంద్రబాబుకు 80 ఏళ్ల వయసు దగ్గరపడుతోందని, చంద్రబాబు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు. అంతేకాదు, టీడీపీ నేతలు, వారి పిల్లలు, బంధువులు యాక్సిడెంట్ లు చేస్తే ఈ మాదిరిగానే హత్యాయత్నం కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే జగన్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. యాక్సిడెంట్ చేసిన కొడుకును తప్పించేందుకు అప్పల రాజు ప్రయత్నించడం ఒక నేరం, కాబట్టి అతడిని అరెస్ట్ చేశారు. అప్పలరాజు ఏదో ఘనకార్యం చేసిన వాడిలాగా ఆయనను జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం పెద్ద కామెడీ. ఇక, పరామర్శకు వెళుతూ నాలుగు గంటల పాటు ఎన్నికల ప్రచారం మాదిరి రోడ్ షో చేస్తూ జగన్ వెళ్లడం అంతకన్నా పెద్ద కామెడీ. చివరకు టైం అయిపోవడంతో అప్పల రాజును కలవకుండానే జగన్ వెనక్కి వెళ్లడం ఈ ఎపిసోడ్ కే హైలైట్.

This post was last modified on July 30, 2026 7:41 pm

Share

Recent Posts

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

16 minutes ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

28 minutes ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

2 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

4 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

4 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

5 hours ago