హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో మంచి బ్రేక్ ఇచ్చిన సినిమాల్లో నేను లోకల్ ఒకటి. న్యాచురల్ స్టార్ నాని జంటగా తను ఇచ్చిన పెర్ఫార్మన్స్ కు మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గానూ అది హిట్టవ్వడం తెలిసిందే. తర్వాత ఈ జోడి మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంది దసరాలోనే. ఇది కూడా బ్లాక్ బస్టర్ కావడంతో హిట్ సెంటిమెంట్ కొనసాగింది. మళ్ళీ ఈ కాంబో ఇప్పట్లో సాధ్యం కాదనుకున్నారు కానీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలనే నిజం చేశారు. ది ప్యారడైజ్ రూపంలో అది తీరనుంది.
కీలకమైన స్పెషల్ సాంగ్ కోసం కీర్తి సురేష్ అంగీకారం తెలిపినట్టుగా లేటెస్ట్ అప్డేట్. గ్లామర్ ఒలకబోసేలా కాకుండా ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్ తో శ్రీకాంత్ ఓదెల దాన్ని డిజైన్ చేసినట్టు తెలిసింది. త్వరలోనే చిత్రీకరించబోతున్నారు. హీరో దర్శకుడితో ఉన్న బాండింగ్ దృష్ట్యా కీర్తి సురేష్ దీనికి ఒప్పుకుందట. కయదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ వయోలెంట్ యాక్షన్ డ్రామాలో మోహన్ బాబు, రాఘవ్ జుయెల్ విలన్లుగా నటిస్తున్నారు. షూట్ చివరి దశలో ఉంది.
ఇప్పుడు అందరి కళ్ళు రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ మీద ఉన్నాయి. సెప్టెంబర్ 24 అని ఫిలిం నగర్ వర్గాల్లో తెగ ప్రచారం జరుగుతున్నా టీమ్ మాత్రం అధికారికంగా ధ్రువీకరించడం లేదు. ఆగస్ట్ చివరివారంకల్లా గుమ్మడికాయ కొడతామనే కాన్ఫిడెన్స్ ఉంటేనే ప్రకటన ఇవ్వాలని అనుకున్నారట. అయితే బాలన్స్ షూటింగ్ సవ్యంగా జరుగుతూ ఉండటం, స్పెషల్ సాంగ్ కోసం భామ దొరికిపోవడం ఊరట కలిగిస్తున్నాయి. సో నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన రావడమే ఆలస్యం.
నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మీద థియేటర్ బిజినెస్ భారీగా జరగనుంది. నైజామ్ సీడెడ్ ఫలానా రేట్లకు అమ్ముడుపోయిందనే వార్తలు వస్తున్నాయి కానీ బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ చేయలేదట. ఒక వారంలో అన్నీ కొలిక్కి రావొచ్చని అంటున్నారు. సెకండ్ ఆడియో సింగల్ త్వరలో వదలబోతున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద నాని అభిమానులు ఓ రేంజ్ లో నమ్మకం పెట్టుకున్నారు. ఆయా షేర్ ఆల్రెడీ 200 మిలియన్ల వ్యూస్ దాటేసి బలమైన పునాది వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
