మాస్ మహారాజా రవితేజ ఇరుముడి మీద మంచి బజ్ ఉంది. గత కొన్ని సినిమాలు ఎంత ఫ్లాప్ అయినా దీని గురించి పాజిటివ్ వైబ్స్ వినిపిస్తున్నాయి. కారణం అయ్యప్పస్వామి అంశాన్ని బలంగా వాడుకోవడం. ఇప్పటికే రెండు పాటలు వచ్చేశాయి. అసలైన మల్లెపూల పల్లకి సాంగ్ తో పాటు ట్రైలర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 21 ఎంతో దూరంలో లేదు. కేవలం పాతిక రోజుల మాత్రమే సమయం ఉండటంతో టీమ్ ఉరుకులు పరుగులు మీద ఉంది.
కంటెంట్ మీద ఎంత నమ్మకమున్నా క్రమం తప్పకుండా సౌండ్ చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. పెద్ది నుంచి చెన్నై లవ్ స్టోరీ దాకా అందరూ పాటించిన సూత్రం ఇదే. లెనిన్, మా ఇంటి బంగారం ఈ విషయంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. సమంతకు ఏకంగా వంద కోట్ల గ్రాసర్ వచ్చి చేరింది. ఇరుముడికి మంచి ఛాన్స్ ఉంది. ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు అందుకుంటే కనక సాలిడ్ హిట్ దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి.
ప్రత్యేకంగా ఇరుముడి గురించి చెప్పడానికి కారణం ఉంది. కేవలం వారం గ్యాప్ లో ఆగస్ట్ 26 ‘టాక్సిక్’ వస్తోంది. అతి త్వరలో ట్రైలర్ లాంచ్ జరగనుంది. అక్కడి నుంచి నాన్ స్టాప్ పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా హీరో యష్ కనిపించేలా పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీ సిద్ధం చేసుకున్నారు. ఇంకోవైపు ఆగస్ట్ 20 రానున్న దుల్కర్ సల్మాన్ ‘ఐ యాం గేమ్’కు తెలుగులో సైతం మంచి రిలీజ్ దక్కేలా ప్రొడ్యూసర్లు ప్లాన్ లో ఉన్నారు. ఇవన్నీ ఇరుముడి చుట్టూ ఉన్న చిక్కులు.
ఇక్కడితో అయిపోలేదు. వారం ముందు అగస్ట్ 14 ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వస్తోంది. టాక్ పాజిటివ్ ఉంటే రెండో వారం థియేటర్లు హోల్డ్ అవుతాయి. టాక్సిక్ పంపిణి చేస్తోంది దిల్ రాజు. సో సహజంగా ఇరుముడికి రెండో వారం నుంచి స్క్రీన్ల పరంగా కోత పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ టాక్. మైత్రి ప్రొడక్షన్ కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఏది ఏమైనా ఇరుముడిని బాగా జనంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత దర్శకుడు శివ నిర్వాణ బృందం మీద ఉంది. వీలైనంత త్వరగా అమలు చేయాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
