Movie News

జనం ఏమనుకుంటున్నారు నాయకా

రాజకీయ రంగప్రవేశానికి ముందు ఇదే తన చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడు థియేటర్లలో అడుగు పెట్టేసింది. తమిళనాడులో నిన్నటి నుంచే దీని జ్వరం పీక్స్ కు వెళ్లిపోగా తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాల్లో అభిమానులు సందడి చేయడం కనిపించింది. కొన్ని సింగల్ స్క్రీన్లలో వేసిన ఫాన్ షోలు ఫుల్ అయ్యాయి. అయితే చూసినవాళ్లు ఎలా ఫీలయ్యారు, టాక్ ఏంటి ఇత్యాది విషయాల మీద సామాన్య ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. అదైతే బయటికి వచ్చేసింది.

భగవంత్ కేసరి రీమేక్ గా రూపొందిన జన నాయకుడు మీద ఏమంత ఆశాజనకమైన ఫీడ్ బ్యాక్ కనిపించడం లేదు. బాలయ్య సినిమాని చెడగొట్టారని, విలన్ పాత్రను దారుణంగా డిజైన్ చేసుకున్నారని, క్లైమాక్స్ నవ్వొచ్చేలా కంపోజ్ చేశారని ఇలా రకరకాలుగా కామెంట్స్ ఎక్స్, ఇన్స్ టాలో కనిపిస్తున్నాయి. అయితే కమర్షియల్ మూవీస్ కి తొలి రోజు టాక్ ఎలా ఉన్నా స్టార్ పవర్ వాటిని వీకెండ్ వరకు నిలబెడుతుంది. అందులోనూ విజయ్ హీరో కాబట్టి ఆ సానుకూలత ఎక్కువ పని చేస్తుంది.

మరి ఈ మిక్స్డ్ రెస్పాన్స్ ని జన నాయకుడు ఏ మేరకు తట్టుకుంటాడో చూడాలి. తమిళనాడులో దాదాపు షోలన్నీ ఫుల్ అయిపోగా ఆదివారం దాకా ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి బయ్యర్లు అంచనా వేస్తున్నారు. సినిమా బాగున్నా లేకున్నా తలపతిని ఒకసారి తెరమీద సెలెబ్రేట్ చేసుకోవాలని ఆడియన్స్ నిర్ణయించుకోవడంతో థియేటర్లు నిండుగా కళకళలాడుతున్నాయి. కొన్ని చోట్ల టికెట్లు బ్లాక్ లో రెట్టింపు ధరకు అమ్మినా దొరకని పరిస్థితి తలెత్తింది.

ఇదంతా పక్కన పెడితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటనకు స్వస్తి చెప్పిన విజయ్ మొదటి విడతలోనే ముఖ్యమంత్రి కావడం సంచలనం. నిజానికి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాసుకున్న ఎపిసోడ్స్ జన నాయకుడులో చాలా ఉన్నాయి. ఒకవేళ పక్కాగా గెలుస్తాడని తెలిసి ఉంటే స్క్రిప్ట్ లో అన్ని మార్పులు చేసేవాళ్ళు కాదేమో. అందుకే కొన్ని సన్నివేశాలు సింక్ లో లేవనిపించేలా ఉన్నాయి. వీకెండ్ అయ్యాక సినిమా ఏ స్థాయిలో నిలుస్తుందనే క్లారిటీ వస్తుంది.

This post was last modified on July 23, 2026 4:29 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

2 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

3 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

3 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

6 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

8 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

8 hours ago