ఒక ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక హీరో.. ఇంకా ఎంతో వయసు, కెరీర్ ఉండగానే సినిమాలు వదిలేసి వెళ్లిపోవడం అరుదు. తమిళ కథానాయకుడు విజయ్ ఈ పనే చేశాడు. రెండేళ్ల కిందట టీవీకే పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్.. చివరగా ‘జననాయగన్’ అనే సినిమా చేశాడు. ఇది తెలుగు హిట్ ‘భగవంత్ కేసరి’ ఆధారంగా తెరకెెక్కిన సంగతి తెలిసిందే.
సంక్రాంతికే విడుదల కావాల్సిన ఈ చిత్రం.. సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడి ఎట్టకేలకు గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చివరగా ఒకసారి తమ అభిమాన కథానాయకుడి సినిమాను థియేటర్లలో సెలబ్రేట్ చేయడానికి విజయ్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా కదిలారు. ఈ రోజు ఉదయం నుంచి తమిళనాట సంబరాలు మామూలుగా లేవు. విజయ్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండడంతో విజయ్ అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది.
ముందు అనుకున్నట్లుగా సంక్రాంతికి ‘జననాయగన్’ రిలీజై ఉంటే.. ఆయన పేరు ముందు ఎప్పట్లాగే ‘దళపతి’ అని మాత్రమే ఉండేది. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సినిమా రిలీజ్ కావడంతో టైటిల్ కార్డ్ మారిపోయింది. గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి అని జోడించడంతో పాటు ‘సి.జోసెఫ్ విజయ్’ అని ఆయన పూర్తి పేరును వేశారు. అంతే కాక తమిళనాడు అసెంబ్లీని షేక్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక మూమెంట్‌ను కూడా సినిమాలో పెట్టేశారు.
ముఖ్యమంత్రిగా విజయ్ సూటేసుకుని స్టైల్‌గా అసెంబ్లీలో చేసిన ఒక మేనరిజంను సినిమా కోసం తీసుకుని టైటిల్ కార్డులో వేసింది ‘జననాయగన్’ టీం. ఇది విజయ్ అభిమానులు కూడా ఊహించని సర్ప్రైజ్. దీంతో థియేటర్లలో ఫ్యాన్స్ కోలాహలం మామూలుగా లేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. ‘వన్ లాస్ట్ టైం’ అంటూ విజయ్‌కి ట్రిబ్యూట్‌గా ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి సోషల్ మీడియాను ఉదయం నుంచి షేక్ చేస్తున్నారు అభిమానులు. ఐతే ‘జననాయగన్’లో ఫ్యాన్ మూమెంట్స్‌కు లోటు లేకపోయినా.. ఈ సినిమాకు అంత పాజిటివ్ టాక్ అయితే లేదు.
This post was last modified on July 23, 2026 3:01 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…