తెలంగాణ ఇచ్చాం.. అయినా.. పార్టీ అధికారంలోకి రాలేదు.. అనే స్థాయి నుంచి పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇలా.. పార్టీని చివరి ఆరు మాసాలు(2023కు ముందు) దూకుడుగా ముందుకు తీసుకువెళ్లడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకొన్నదే. ఎంతో మంది ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నా ఈ ఒక్క కారణమే రేవంత్ రెడ్డికి సీఎం సీటును అప్పగించేలా చేసింది.
మరి ఈ తరహా.. పరిస్థితి ఏపీలో ఏమైంది ? అనేది ప్రశ్న. గత 2024 ఫిబ్రవరిలో అనేక ఆశలు, అంచనాలతో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల.. ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఆమె కష్టపడితే.. పోయిన ప్రాభవాన్ని తీసుకువస్తే.. ఆమెకు రెండు అవకాశాలు తలుపు తట్టే చాన్స్ కనిపిస్తోంది. పార్టీని బలోపేతం చేసి.. క్షేత్రస్థాయిలో సీనియర్లను తీసుకుని వారిని రంగంలోకి దింపి.. పార్టీకి పునర్వైభవం తీసుకువస్తే.. ఆమెకు ముఖ్యమంత్రి పీఠం గోల్డెన్ ప్లేట్ లో అందుతుంది.
పోనీ.. ఇది కుదరదు. పార్టీ బలపడేందుకు ఇంకా సమయం పడుతుందన్న అంచనా ఉంటే.. రెండో స్థానం కోసం అయినా.. ఆమె ప్రయత్నం చేయొచ్చు. అదే.. ప్రధాన ప్రతిపక్షం. కనీసంలో కనీసం.. 25 స్థానాల్లో పార్టీని గెలిపించుకున్నా.. ప్రధాన ప్రతిపక్షం హోదా వరిస్తుంది. తద్వారా.. ఆమెకు.. పార్టీకి కూడా మేలు జరుగుతుంది. కానీ, దీనిపై కూడా షర్మిల దృష్టి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో షర్మిల అసలు వ్యూహం ఏం చేస్తున్నారన్నది ప్రశ్న.
అంతర్గతంగా జరుగుతున్న చర్చ.. వస్తున్న వార్తల ప్రకారం.. సీనియర్లకు-షర్మిలకు మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. ఇది నిజమే కావొచ్చు. పార్టీపరంగా ఎత్తుకోవాల్సిన అజెండాను ఆమె పక్కన పెట్టి.. వ్యక్తిగత విషయాలపై చూపిస్తున్న ఇంట్రస్ట్ దీనిని డామినేట్ చేసిందన్నది వాస్తవం. ఇదే పెద్ద సమస్యగా మారింది. కానీ, కొంత మేరకు నాలుగు అడుగులు ముందుకు వేసి.. అందరినీ కలుపుకొని పోతే.. ఆమెకు సీఎం సీటు లేదా.. ప్రధాన ప్రతిపక్షం స్థాయి గౌరవం రెండింటిలో ఏదో ఒకటి ఖాయమని అంటున్నారు పరిశీలకులు. మరి ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచన చేస్తారో లేదో చూడాలి.
This post was last modified on July 23, 2026 2:54 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న భోగి మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ గత వారం రోజులుగా విస్తృతంగా ప్రమోషన్లు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవల ఎదురైన సాంకేతిక సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. సంస్థకు చెందిన…
ప్రపంచవ్యాప్తంగా అందాల పోటీల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన మిస్ యూనివర్స్ 2026 పోటీలు ముగిశాయి. 75వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన…
మున్సిపల్ ఎన్నికలైన పాతిక రోజుల తర్వాత అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సజావుగానే కొనసాగింది. అదేం చిత్రమో…
బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…
రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…