ఎల్లుండి విడుదల కాబోతున్న భోగి మీద మాస్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ గత వారం రోజులుగా విస్తృతంగా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది ఎడతెరిపి లేకుండా పబ్లిసిటీలో భాగమవుతున్నారు. హీరోయిన్ డింపుల్ హయతి బాగా హైలైట్ అవ్వడం సోషల్ మీడియా జనాలు గమనిస్తున్నారు. అయితే అనుపమ పరమేశ్వరన్ ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే తనేమి క్యామియో చేయలేదు. మెయిన్ కథానాయిక తనే.
మాములుగా బడ్జెట్ తో సంబంధం లేకుండా తాను ఉంటే చాలు అనుపమ ప్రతి సినిమా ప్రచారంలో పాల్గొంటుంది. పెద్దగా ఆడకపోయినా ఆహా కళ్యాణం కోసం రోజుల తరబడి హైదరాబాద్ లోనే ఉండి బాగా ప్రమోట్ చేసుకుంది. మరి భోగి విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉందనేది అంతు చిక్కడం లేదు. పైగా శర్వానంద్ తనకు కొత్త కాదు. ఈ కాంబోతో గతంలో శతమానం భవతి లాంటి సూపర్ డూపర్ హిట్ ఉంది. అలాంటప్పుడు ఇంకా యాక్టివ్ గా కనిపించాలి. కానీ అలా జరగలేదు.
పాత్రని కుదించడమో లేదా టీమ్ తో ఏవైనా ఇష్యూస్ ఉన్నాయేమో తెలియదు కానీ మొత్తానికి అనుపమ కనిపించని లోటుని డింపుల్ హయతిని హైలైట్ చేయడం ద్వారా భోగి టీమ్ తెలివిగా ప్లాన్ చేసుకుంది. ట్రైలర్ లో ఒక డైలాగు, రెండు మూడు షాట్స్ తప్ప అనుపమ పెద్దగా కనిపించలేదు. వీటి సంగతి ఎలా ఉన్నా ఇన్ సైడ్ టాక్ ప్రకారం తనకు తగిన ప్రాధాన్యం అయితే ఉందట కానీ ఎందుకు కంప్లీట్ గా సైడ్ అవుతుందో అర్థం కావడం లేదని టీమ్ సభ్యుల మాట.
ఇదంతా ఎలా ఉన్నా భోగికి మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంది. మైసా, హైందవ వాయిదా పడటంతో తగినన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తారలు పాజిటివ్ టాక్ తో రెండో వారంలో అడుగు పెట్టినా అవి మాస్ జనాలకు పూర్తిగా చేరలేదు. సో ఈ గ్యాప్ ని కనక భోగి సరిగా వాడుకుని కంటెంట్ తో కొట్టగలిగితే వృషకర్మ వరకు సోలోగా వసూళ్లు లాగేయొచ్చు. హిట్ అయితే మటుకు శర్వా సరికొత్త మేకోవర్ కు న్యాయం జరిగినట్టు అవుతుంది.
This post was last modified on November 25, 2026 9:22 pm
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవల ఎదురైన సాంకేతిక సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. సంస్థకు చెందిన…
మున్సిపల్ ఎన్నికలైన పాతిక రోజుల తర్వాత అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సజావుగానే కొనసాగింది. అదేం చిత్రమో…
బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…
రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…
2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…
వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…