వైద్య విద్య చదవాలని అనుకునే విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఏక కాలంలో నిర్వహించే ‘నీట్’ పరీక్షకు సంబధించిన ప్రశ్నపత్రం లీకై.. సరిగ్గా 75 రోజులు అయింది. ప్రధాని నరేంద్ర మోడీ మాటలో చెప్పాలంటే.. ఇది అత్యంత సుదీర్ఘమైన సమయం. ఆయన ప్రతి రోజునూ గంటలతో కాదు.. సెకన్లతో లెక్కించుకుని పనిచేస్తారు. అందుకే కర్మ యోగి అంటూ.. కమల నాథులు స్థుతిస్తారు. స్తోత్రాలు చేస్తారు. అలాంటి ప్రధాని నీట్ పేపర్ లీకు ఘటనపై దేశ అట్టుడుకుతున్న సమయంలో అంటే.. మే నెలలోనే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లిపోయారు. ఆ తర్వాత.. వారానికి దేశానికి తిరిగివచ్చారు. అయినా.. ఏమీ పట్టించుకోలేదు.
అంతేకాదు.. అసలు సమస్యే కాదన్నట్టుగా ప్రధాని మోడీ వ్యవహరించారన్నది వాస్తవం. ఇక్కడితో కథ అయిపోలేదు.. అని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు నినదించినా.. మోడీ స్పందించలేదు. అంతేనా.. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలుగా ఉన్న వారు కూడా ఎవరూ పెదవి విప్పలేదు. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే మీడియా తో మాట్లాడారు. కఠిన చర్యలు తప్పవన్నారు. అరెస్టు చేస్తున్నామన్నారు. మరోసారి పరీక్షలు నిర్వహిస్తున్నామని ముక్తాయించారు. కానీ, చిత్రం ఏంటంటే.. మంత్రి ఈ ప్రకటన చేసిన జూన్ 1వ తేదీ నాటికి.. నలుగురు విద్యార్థులు(అప్పటికే నీట్ రాసినవారు ) ఆత్మహత్యలు చేసుకున్నారు.
కట్ చేస్తే.. జూన్‌లోనూ ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లిపోయారు. తనకు సంబంధమే లేదన్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఇక, బొద్దింకలు ఏం చేస్తాయంటూ.. పలువురు మంత్రులు కాక్రోచ్ జనతా పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చివరకు పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చినప్పుడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఒకానొక దశలో కాక్రోచ్ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆస్తులు, ఆదాయం వెనుక విదేశీ శక్తులు ఉన్నాయని ఆరోపించిన ఘనులు కూడా ఉన్నారు. దీంతో కాక్రోచ్ చేపట్టిన ఉద్యమం వెల్లువలా సాగి.. దేశం మొత్తం తిరగబెట్టేస్తున్న సమయంలో సామాజిక ఉద్యమకారులు, తటస్థులు , మేధావులు ముందుకు కదలడంతో మరింతగా ఉద్యమం పెను ఉప్పెన అయింది. పార్లమెంటును ముట్టడిస్తామన్న ప్రకటన తీవ్రతరమైంది.
ఇక, సోమవారం(జూలై 20) జరిగిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో చోటు చేసుకున్న హింస అనంతరం.. ప్రధాని తొలిసారి ఈ వ్యవహారంపై నోరు విప్పారు. నీట్ సమస్యను జాతీయ సమస్యగా అభివర్ణించారు. దీనిని సరిదిద్దేందుకు జాతి నడుం బిగించాలని సుద్దులు వల్లించారు. వాస్తవం ఏంటి? నిజంగానే ఇది జాతి సమస్యా..? జాతీయ సమస్యా..? అంటే.. ఎట్టి పరిస్థితిలోనూ కాదన్నదే మేధావుల మాట. కేవలం నిర్లక్ష్యం.. ఏం చేసినా అడగరనే ధీమా.. తమకు అప్రతిహత అధికారం దక్కిందన్న అంతులేని భరోసా.. ప్రశ్నించే వారిపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలను పంపించవచ్చన్న ధీమా.. వెరసి.. నీట్ పాపంలో జాతి సమస్య కాదు.. జాతీయ సమస్యకాదు.. అక్షరాలా కేంద్ర ప్రభుత్వ సమస్యే స్పష్టమవుతోంది.
అయినప్పటికీ.. కర్మణ్యేవాధికారస్తే.. మాఫలేషు కదాచన.. అన్న గీతాసూక్తినే.. మోడీ వల్లెవేస్తున్నారు. తాము చేసిన పనుల తాలూకు ఫలితాన్ని ప్రశ్నించరాదు.. తాము చేస్తున్న పాలన తాలూకు ఫలితాలను ప్రశ్నించరాదు.. అన్న సూత్రాన్నే నేటికీ కేంద్రం పాటిస్తోంది. ఫలితంగా.. నేడు దేశం మొత్తం ఏకమవుతోందన్న సంగతిని ప్రధాని మరిచిపోయారన్న విజ్ఞుల మాటలో అక్షరాలా వాస్తవం కనిపిస్తోంది. బుధవారం ఢిల్లీలో ధర్నాకు భయపడి.. రైళ్లను నిలుపుదల చేశారు. ప్రజారవాణాను స్తంభింప చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు హెచ్చరికలు జారీ చేశారు.
ఇది ఒక్క ఢిల్లీలోనే కాదు.. ముంబై.. సహా.. అనేక రాష్ట్రాల్లో శాంతిభద్రతల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ తీరు!. మరి ఇది జాతి సమస్యా? జాతీయ సమస్యా? అంటే.. ఇప్పటికి ఇది ఈ రెండూ కాదు. కేవలం ప్రభుత్వ సమస్యే. అయితే.. దీనిని పరిష్కరించకపోతే.. వచ్చే ఎన్నికల నాటికి లేదా.. అంతకుముందే.. ఇది పెను ఉప్పెనై.. జాతీయ సమస్యగా మారి.. సర్కారును కూలగొట్టడం ఖాయమన్న వ్యాఖ్యలు సర్వత్రా ప్రతి ధ్వనిస్తున్నాయి!!.
This post was last modified on July 23, 2026 3:10 pm
యువత, సోలో లాంటి చిత్రాలతో మెప్పించి.. ‘గీత గోవిందం’ చిత్రంతో తెలుగులో మంచి డిమాండ్ తెచ్చుకున్న దర్శకుడు పరశురామ్. ఆ…
ఒక ఇండస్ట్రీలో నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక హీరో.. ఇంకా ఎంతో వయసు, కెరీర్ ఉండగానే సినిమాలు వదిలేసి…
తెలంగాణ ఇచ్చాం.. అయినా.. పార్టీ అధికారంలోకి రాలేదు.. అనే స్థాయి నుంచి పదేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి…
నీట్ పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవకతవకలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పరీక్షా విధానంలో పారదర్శకత, ప్రశ్నాపత్రాల…
హాలీవుడ్ మూవీ ది ఒడిస్సి ఇండియాలో వంద కోట్ల మార్కు అందుకోవడం చిన్న రికార్డు కాదు. సూపర్ హీరోస్, ప్రమాదకర…
నీట్ పరీక్షల అంశంపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. యువత సంక్షేమం, వారి…