తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయంతో అనూహ్యంగా ముఖ్యమంత్రి అయిన విజయ్.. చివరగా ఒకసారి బాక్సాఫీస్ వరకు రెడీ అయ్యాడు. ఆయన చివరి చిత్రం జననాయగన్ ఈ గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పబోతూ చివరగా చేసే చిత్రం చాలా స్పెషల్ గా ఉండాలని ఏ పెద్ద హీరో అయినా భావిస్తాడు. రీమేక్ మూవీ చెయ్యాలని అనుకోడు.
కానీ విజయ్ మాత్రం నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు చిత్రం భగవంత్ కేసరి రీమేక్ తో కెరీర్ ను ముగించాలని అనుకోవడం ఆశ్చర్యమే. నిజానికి విజయ్ చివరి చిత్రానికి దర్శకుడిగా ఎంపికైన హెచ్.వినోద్ కు రీమేక్ మూవీ చేసే ఉద్దేశం లేదట. కానీ విజయ్ పట్టుబట్టి బాలయ్య సినిమాను తనతో రీమేక్ చేయించాడట.
విజయ్ చివరి సినిమా కోసం సంప్రదింపులు జరిగినపుడు.. తాను క్లాష్ ఆఫ్ మాస్టర్స్ అని ఒక కథ చెప్పానని.. ఆ కథ బావున్నప్పటికీ తాను చేసే లాస్ట్ మూవీ అంత హెవీగా వద్దని విజయ్ తనతో అన్నాడని.. భగవత్ కేసరిని రీమేక్ చేద్దామని ఆయనే సూచించాడని వినోద్ తెలిపాడు.
విజయ్, బాలయ్య ప్రపంచాలు పూర్తిగా వేరని.. ఈ సినిమానే ఎందుకు రీమేక్ చెయ్యాలని అనుకుంటున్నారు అని అడిగితే.. భగవంత్ కేసరిలో ఒక్కో సీన్ గురించి ఆయన వివరించి వాటి ప్రత్యేకత గురించి చెప్పారని వినోద్ తెలిపాడు.
ఇందులో ఆడ పిల్లల సాధికారత గురించి చెప్పిన విషయాలు విజయ్ కి ఎక్కువ నచ్చినట్లు వినోద్ వెల్లడించాడు. ఐతే ఒరిజినల్ తో పోలిస్తే జననాయగన్ లో దాదాపు 50 శాతం మార్పులు ఉంటాయని.. ప్రథమార్ధంలో 60 శాతం సీన్లు మాతృక నుంచి తీసుకున్నవి ఉంటే.. రెండో అర్ధంలో 20 శాతమే ఉంటాయని వినోద్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates