Movie News

మహేష్ బాబు అన్న కొడుకు హిట్ కొట్టాలి!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో తరం వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఘట్టమనేని అభిమానుల్లో క్యూరియాసిటి మొదలైంది.

గతంలో రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసి తనదైన ప్రయత్నం చేశారు. కానీ నటుడిగా ఆయన కెరీర్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. అయితే తన కొడుకును ఒక మంచి హీరోగా చూడాలనేది రమేష్ బాబు పెద్ద డ్రీమ్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు. ఇప్పుడు తండ్రి కలని నిజం చేస్తూ, ఘట్టమనేని వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను జయకృష్ణ తన భుజాలపై వేసుకున్నాడు.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు తర్వాత ఘట్టమనేని కాంపౌండ్ నుంచి వస్తున్న హీరో కావడంతో స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ చూస్తుంటే జయకృష్ణ మొదటి సినిమా కోసమే చాలా హార్డ్ వర్క్ చేసినట్లు కనిపిస్తోంది. బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా ఒక మాస్ హీరోకి కావాల్సిన లుక్స్ ను బాగానే మేనేజ్ చేశాడు.

ఈ సినిమాకు అజయ్ భూపతి లాంటి రస్టిక్ డైరెక్టర్ తో పాటు వైజయంతీ మూవీస్ వంటి పెద్ద బ్యానర్ తోడు కావడం ప్లస్ పాయింట్. అలాగే మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతినాయకుడిగా కనిపించనుండటం మరో హైలెట్. బాబాయ్ మహేష్ బాబు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. ఇక వారసత్వం అనేది మొదటి సినిమా ఓపెనింగ్స్ వరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర నిలబడాలన్నా, కెరీర్ లాంగ్ రన్ సాగాలన్నా కచ్చితంగా కంటెంట్ లో దమ్ముండాలి.

జయకృష్ణ ఎంచుకున్న రూట్ కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే జోనరే అయినప్పటికీ, థియేటర్లలో ఆడియన్స్ ఎమోషన్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతారనే దాన్ని బట్టే అసలైన సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా రమేష్ బాబు ఆశయాన్ని నెరవేరుస్తూ వస్తున్న ఈ ఘట్టమనేని కుర్రాడు మొదటి సినిమాతోనే ఒక సాలిడ్ హిట్ అందుకోవాలని ఇండస్ట్రీ వర్గాలతో పాటు కామన్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. మరి ‘శ్రీనివాస మంగాపురం’ జయకృష్ణ కెరీర్ కు ఎలాంటి స్టార్టింగ్ ఇస్తుందో చూడాలి.

This post was last modified on July 20, 2026 9:29 pm

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

4 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

5 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

8 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

9 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

11 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

12 hours ago