Political News

అయోధ్య విరాళాల చోరీపై రాజకీయం ఒద్దు: సుప్రీం

అయోధ్య రామ్ ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగంపై వస్తున్న ఆరోపణల వ్యవహారం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ వివాదానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, దీనిపై రాజకీయాలు చేయవద్దంటూ తీవ్రస్థాయిలో మందలించింది. కేవలం ఒక నేరానికి సంబంధించిన సాధారణ కేసు మాత్రమేనని, ఇందులో సరైన దర్యాప్తు జరిగేలా చూడటమే కోర్టు బాధ్యత అని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టులు రాజకీయాలు చేసే వేదికలు కావని గట్టిగా గుర్తుచేసింది.

ఈ నిధుల గోల్‌మాల్ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణతో పాటు, ఫొరెన్సిక్ ఆడిట్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తో తనిఖీలు చేయించాలని పిటిషనర్లు కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అకౌంట్లను సమగ్రంగా పరిశీలించాలనేది వారి డిమాండ్. ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అని సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. కోర్టు ప్రశ్నకు సాలిసిటర్ జనరల్ స్పందిస్తూ, ఈ వ్యవహారంపై ఇప్పటికే సిట్ ఏర్పాటయిందని, ఉత్తరప్రదేశ్ పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారని కోర్టుకు తెలిపారు.

ఇప్పటివరకు సిట్ ఇచ్చిన మధ్యంతర నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి, 8 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా దుర్వినియోగమైన విరాళాల నుంచి దాదాపు 80 లక్షల రూపాయల నగదును కూడా రికవరీ చేశారు. ఈ వివాదం తీవ్రమవడంతో ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. ఆలయానికి సంబంధించిన ఆర్థిక రికార్డులు, పరిపాలనా పద్ధతులను ఇంకా లోతుగా పరిశీలించడానికి సిట్ మరికొంత సమయం కోరినట్లు తెలుస్తోంది.

విరాళాల సేకరణ, లెక్కింపు విధానాల్లో ఎలాంటి మార్పులు చేయాలో కూడా సిట్ తన తుది నివేదికలో సిఫార్సు చేయనుంది. ప్రస్తుతం జరుగుతున్న విచారణ పురోగతిని వచ్చే విచారణ సమయానికి కోర్టుకు వివరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను జూలై 27 కి వాయిదా వేసింది. మరోవైపు ఈ సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా ఆలయ ట్రస్ట్ జూలై 22 న అయోధ్యలో అత్యవసర సమావేశం కానుంది. అక్కడ నిధుల రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.

This post was last modified on July 20, 2026 8:11 pm

Share

Recent Posts

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

9 minutes ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

25 minutes ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

2 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

4 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

4 hours ago

జంతర్ మంతర్… కేసీఆర్ ముందే పసిగట్టారా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో నిరసన చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు…

7 hours ago