ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల నాటి బ్రిటిష్ రాజ్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ వార్ డ్రామాలో ప్రభాస్ ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికుడిగా నటిస్తున్నాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల చుట్టూనే కథ తిరిగినప్పటికీ, ఇది ఆయన బయోపిక్ కాదని మేకర్స్ ముందే క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అందరిలోనూ ఒకటే డౌట్. సినిమాలో అసలు నేతాజీ పాత్రను డైరెక్ట్ గా చూపిస్తారా లేదా?
ఈ తరహా చారిత్రక కథలను తెరకెక్కించేటప్పుడు సదరు లీడర్ క్యారెక్టర్ ను స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడం చాలా సెన్సిటివ్ విషయం. హను రాఘవపూడి ఈ పాత్ర విషయంలో ఏ వ్యూహం ఫాలో అవుతున్నాడనే దానిపై రకరకాల అంచనాలు ఉన్నాయి. ఒకవేళ నేతాజీ క్యారెక్టర్ ను నిజంగానే సీన్లలోకి తెస్తే మాత్రం, ఆ హైప్ ను మ్యాచ్ చేయడం మామూలు విషయం కాదు. ఒక సాధారణ నటుడిని ఆ పాత్రలో చూపిస్తే ఆడియన్స్ అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అందుకే ఎవరైనా పాన్ ఇండియా రేంజ్ ఉన్న స్టార్ హీరోను గెస్ట్ రోల్ లో దించుతారా అనే సందేహం వ్యక్తమవుతోంది.
మరోవైపు, పాత్ర ముఖం చూపించకుండా కేవలం బ్యాక్ డ్రాప్ లో ఆ వాయిస్ ను, ఆ పవర్‌ఫుల్ అరాను మాత్రమే హైలైట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నేతాజీ క్యారెక్టర్ తాలూకు నీడను లేదా వెనక నుంచి మాత్రమే చూపిస్తూ ఆ ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడం వల్ల సీన్లకు మరింత వెయిట్ వస్తుంది. ప్రభాస్ లాంటి కటౌట్ పక్కన నేతాజీగా కనిపించే వ్యక్తి కూడా అంతే పవర్‌ఫుల్ గా ఉండాలి కాబట్టి, ముఖం చూపించకుండా మేనేజ్ చేస్తే ఒక రకంగా సేఫ్ అప్రోచ్ అవుతుంది.
అయితే వీటన్నిటికీ భిన్నంగా నేతాజీ పేరును, ఆయన ఆశయాలను మాత్రమే కథలో వాడుకుంటూ, పాత్రను ఎక్కడా ఫిజికల్ గా స్క్రీన్ పై చూపించకుండా కథ నడిపించే స్కోప్ కూడా ఉంది. ఒక సైనికుడిగా ప్రభాస్ క్యారెక్టర్ చేసే పోరాటం, నేతాజీ ఇచ్చిన పిలుపు చుట్టూనే సాగితే ఆడియన్స్ కు పెద్దగా కంప్లైంట్స్ ఉండవు. కేవలం డైలాగుల్లో, బ్యాక్ గ్రౌండ్ ఎలిమెంట్స్ లో మాత్రమే ఆ ప్రస్తావన ఉంచితే ఎక్కడా ఎలాంటి కాంట్రవర్సీలకు తావుండదు. సినిమాలో ఇతర కీలక పాత్రల కోసం మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ లాంటి సీనియర్ స్టార్లను తీసుకున్న మేకర్స్, నేతాజీ పాత్ర వివరాలను మాత్రం చాలా సీక్రెట్ గా ఉంచారు. స్క్రీన్ పై ఆ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో చూడాలంటే టీజర్ లేదా ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates