Movie News

అనుపమ మాటలకు అర్థమేంటి?

పేరుకు మలయాళ హీరోయినే కానీ.. అనుపమ పరమేశ్వరన్ తెలుగులోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది, ఇక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. మొదట్లో ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఉండేది కానీ.. రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి చిత్రాలతో ఆమె ఇమేజ్ మారిపోయింది. ఈ చిత్రాల్లో లిప్ లాక్స్, ఇంటిమేట్ సీన్లు చేసి తన ఇమేజ్‌ను మార్చేసుకుంది అనుపమ.

ఐతే ఈ మధ్య సినిమాలు కొంచె తగ్గి అంతగా లైమ్ లైట్లో ఉండట్లేదు అనుపమ. వ్యక్తిగత జీవితంలో బిజీ అవ్వడం వల్లే ఈ గ్యాప్ అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఆమె ‘బైసన్’ సినిమాలో నటించేటపుడు తన కోస్టార్ ధ్రువ్ విక్రమ్ ప్రేమలో పడ్డట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తనకు బ్రేకప్ అయిందేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. తన సోషల్ మీడియా పోస్టులు ఆ రకమైన ఆలోచన రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలు షేర్ చేస్తూ అనుపమ పెట్టిన క్రిప్టిక్ కామెంట్ చదివితే అనుమానాలు కలగక మానదు. ఫొటోలు డంప్ చేసినందుకు సారీ చెబుతూ.. ఈ పోస్టు పెట్టే ముందు ఎవరి అనుమతి అడగాల్సిన అవసరం లేకపోయిందని, వీటికి బ్యాగ్రౌండ్ సాంగ్ సెలక్షన్ కోసం, ఇంకెవరో క్యాప్షన్ పెడతారని ఎదురు చూడడం లాంటివేమీ లేవని ఆమె కామెంట్ చేసింది. ఇది అనుపమ క్యాజువల్‌గా పెట్టిన పోస్టులా కనిపించడం లేదు.

బ్రేకప్ తర్వాత తనకు ఫ్రీడమ్ వచ్చిందన్న అర్థం వచ్చేలా ఆ కామెంట్ కనిపిస్తోంది. ధ్రువ్‌తో అనుపమ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి కానీ.. వాళ్లిద్దరూ ఎక్కువగా కలిసి కనిపించడమైతే జరగలేదు. ఈ మధ్య మరీచిక, లాక్ డౌన్ లాంటి చిత్రాలతో పలకరించిన అనుపమ.. ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘భోగి’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు ధ్రువ్ విక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక ద్విభాషా చిత్రం చేస్తున్నాడు.

This post was last modified on July 19, 2026 5:14 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago