యాంకర్లు ఎప్పుడూ యాంకర్లుగానే ఉండిపోవాల్సిన అవసరం లేదని.. వాళ్లు హీరోయిన్లుగా కూడా రాణించగలరని అనసూయ, రష్మి గౌతమ్ లాంటి వాళ్లు రుజువు చేశారు. వీరి కంటే ముందు సుమ, ఝాన్సీ, ఉదయభాను లాంటి వాళ్లు కూడా సినిమాల్లో ట్రై చేసిన వాళ్లే. కానీ వారిలో సుమ, ఉదయభాను సక్సెస్ కాలేకపోయారు. ఝాన్సీ క్యారెక్టర్ రోల్స్‌లో అప్పుడప్పుడూ మెరుస్తోంది.
అనసూయ అందరికంటే ఎక్కువ పేరు సంపాదించింది. ఈ మధ్య స్రవంతి చొక్కారపు కూడా నటనలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఇంకో యాంకర్ నటనలోకి అడుగుపెట్టేలా కనిపిస్తోంది. తన పేరు చర్మిక. ఈ పేరు అంతగా పాపులర్ కాదు కానీ, నిన్న జరిగిన ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంతో ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
చక్కగా యాంకరింగ్ చేస్తూ.. చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించిన ఆమె సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ దృష్టిని ఆకర్షించింది. తన ఫస్ట్ లవ్ గురించి ఆమె ప్రశ్న అడగ్గానే దానికి సమాధానం చెప్పకుండా.. ఈ మధ్య యాంకర్లు చాలా అందంగా తయారవుతున్నారు అంటూ ఆమె బ్యూటీని కొనియాడారు అరవింద్. అంతే కాక హీరోయిన్ అవుతావా, గీతా ఆర్ట్స్‌లో పని చేస్తావా అని కూడా అడిగారు అరవింద్.
ఆయనేదో తమాషాకు ఆ మాట అన్నట్లు కూడా కనిపించలేదు. నిజంగానే ఛాన్స్ ఇచ్చే ఉద్దేశంతోనే అలా అడిగినట్లు కనిపించింది. ఆయనలా అనగానే ఉబ్బితబ్బిబ్బయిపోయిన యాంకర్ చర్మిక.. ఇక మిమ్మల్ని ఏ ప్రశ్నా అడగను అంటూ నవ్వేసింది. మరి నిజంగానే గీతా ఆర్ట్స్ వారి సినిమాలో ఈ అమ్మాయి నటిస్తుందేమో చూడాలి. అరవింద్ ఇలా అన్నాక తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
This post was last modified on July 19, 2026 4:53 pm
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…