వచ్చే వారం విడుదల కాబోతున్న రామాయణ ట్రైలర్ నిన్న ముంబైలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. ఎవరూ సెల్ ఫోన్లలో రికార్డు చేయకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు రహస్యంగా షూట్ చేయడంతో అది కాస్తా బయటికి వచ్చేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. క్లారిటీ లేకపోయినా కంటెంట్ ఎలా ఉందో స్పష్టంగా అర్ధమయ్యే స్థాయిలో కవర్ చేయడంతో దాదాపుగా అంతా రివీలయ్యిందని చెప్పాలి.
ఇలా అయితే 24 తేదీ వరకు వీటిని నిలువరించడం కష్టం. టాక్ ప్రకారం చూసుకుంటే రామాయణ టీజర్ మీద వచ్చిన నెగటివ్ కామెంట్స్ మోతాదు ట్రైలర్ తర్వాత తగ్గే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు నితేశ్ తివారి కీలకమైన విజువల్స్ రివీల్ చేయడం ద్వారా తెలివైన ఎత్తుగడ వేశారు. రన్బీర్ కపూర్, సాయిపల్లవి, యష్ ని పూర్తిగా రివీల్ చేయడంతో పాటు ఇతర ముఖ్యమైన క్యారెక్టర్లను ఒకటి రెండు షాట్ల రూపంలో పరిచయం చేశారు. ఓవరాల్ చక్కగా ఉందని టాక్.
కాకపోతే నాలుగు వేల కోట్ల బడ్జెట్ స్థాయిలో ఇది అనిపిస్తుందా అంటే అనుమానమేనని చెప్పాలి. ఎందుకంటే నిర్మాత నమిత్ మల్హోత్రా పలు ఇంటర్వ్యూలలో చాలా భారీ నెంబర్ చెప్పేశారు. దీంతో అంచనాలు హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవడం పెద్ద ఛాలెంజ్. అందులోనూ రామాయణ లాంటి వందలసార్లు చూసిన కథతో ఆడియన్స్ ని కన్విన్స్ చేయడం అంత సులభంగా ఉండదు. చిన్న విమర్శ కూడా పెద్ద డ్యామేజ్ చేస్తుంది.
దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ బిజినెస్ వ్యవహారాలు మెల్లగా ఊపందుకుంటున్నాయి. తెలుగు హక్కులకు కూడా మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఆదిపురుష్ టైంలో వచ్చిన నెగటివిటీని పూర్తిగా పోగొట్టేలా రామాయణ ఉంటుందని బాలీవుడ్ మీడియా వర్గాలు నమ్ముతున్నాయి. అదే నిజమైతే వసూళ్ల వర్షం ఖాయమే. 3డి, ఐమాక్స్ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ ఎపిక్ వండర్ లో సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ ఇతర ముఖ్య తారాగణం.
This post was last modified on July 19, 2026 1:52 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…