జాతీయ అవార్డుల మీద క్రమంగా అసంతృప్తి శాతం ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయేలా ఉంది. ఇండియన్ ఆస్కార్ గా చెప్పుకునే ఇలాంటి పురస్కారాలకు బయట కూడా చాలా విలువ ఉంది. ఒకప్పుడు సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా దీన్ని సాధించారంటే అదో గొప్ప ఘనత. కొన్ని రోజులపాటు ఆనందంతో నిద్రపోయేవాళ్లు కాదు. కానీ ఈ మధ్య కాలంలో వీటి మీద నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఉత్తమ తమిళ చిత్రంగా రాయన్ ఎంపిక గురించి పెద్ద చర్చ జరుగుతోంది.
జ్యురి సభ్యులు కంటెంట్, ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ కన్నా ఆయా సినిమాల బజ్, కమర్షియల్ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటున్నారన్న విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసిన సత్యం సుందరంకు రాలేదు. విక్రమ్ జీవించిన తంగలన్ ని గుర్తించలేదు. ఇప్పుడే కాదు గతంలో పృథ్విరాజ్ సుకుమారన్ కు గోట్ లైఫ్ కి ఇవ్వనప్పుడు కూడా ఇలాంటి కామెంట్సే వచ్చాయి. సోషల్ మీడియాలో ఎందరో ఘాటుగా క్రిటిసైజ్ చేశారు.
నిజానికి రాయన్ ఒక సగటు యాక్షన్ మాఫియా డ్రామా. ఎప్పుడూ చూడనివి కనిపించనివి ఉండవు. ఆ మాటకొస్తే తమిళంలో డీసెంట్ గా ఆడింది కానీ తెలుగుతో సహా ఇతర భాషల్లో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. సరే వసూళ్ల లెక్కలు అక్కర్లేదు అనుకుందాం. కానీ అంత యునీక్ కంటెంట్ అందులో ఏముందో ఎంత బుర్ర చించుకున్నా అర్థం కాదు. బహుశా ధనుష్ దర్శకత్వం వహించాడనే సాఫ్ట్ కార్నర్ ఉందా లేక ఇంకేదైనా తెరవెనుక రీజన్ ఉండొచ్చాని జనాలు అనుమానిస్తున్నారు.
ఈ మధ్య పెద్ది సక్సెస్ మీట్ లో చిరంజీవి ఒక మాట అన్నారు. అవార్డులు తెచ్చుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయని. ఆయన ఉద్దేశం ఏదైనా మీనింగ్ మాత్రం ఇంకోలా వెళ్ళిపోయింది. అంటే ఇన్ఫ్లూయెన్స్ ఉంటే జరగొచ్చేమో అనేలా కొందరు వాటిని అర్థం చేసుకున్నారు. మరి పెద్దికి వచ్చే సంవత్సరం అవార్డు ఇస్తారా అంటే ఏమో చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ దురంధర్ లో రణ్వీర్ సింగ్ కు రావొచ్చనే ప్రచారం ఉత్తరాది వర్గాల్లో జోరుగా ఉంది. చూడాలి ఏం చేస్తారో.
This post was last modified on July 19, 2026 2:21 pm
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…
ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…
తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…
నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…
తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…