Movie News

ఆలస్యం చేస్తే అమృతం విషమే

పెద్దికి ఒళ్ళు హూనం చేసుకుని దర్శకుడు బుచ్చిబాబు అడిగిన దానికి రెండువందల శాతం ఎక్కువ ఇచ్చిన రామ్ చరణ్ దానికి తగ్గ పూర్తి ప్రతిఫలం అందుకోలేదన్నది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో హిట్టయ్యిండొచ్చు కానీ బాలీవుడ్, ఓవర్సీస్ తో పాటు తమిళనాడు కేరళలో ఆశించిన ఫలితం రాకపోవడం ముమ్మాటికీ నిరాశ కలిగించే విషయమే. ఓటిటిలో వచ్చాక కూడా రిజల్ట్ పెద్దగా మారలేదు. చరణ్ పెర్ఫార్మన్స్ గురించి కామెంట్స్ లేవు కానీ బుచ్చిబాబు మీద అయితే ట్రోలింగ్ ఉంది.

సరే హిట్లు ఫ్లాపులు అందరికీ సహజమే కానీ రామ్ చరణ్ వీలైనంత త్వరగా గుర్తించాల్సిన సత్యం ఒకటుంది. ఆర్సి 17 ఏళ్లకేళ్లు షూటింగ్ జరగకుండా చూసుకోవాలి. గేమ్ ఛేంజర్ కు మూడు సంవత్సరాలు, పెద్దికి రెండు సంవత్సరాలు ఖర్చు పెడితే దక్కింది ఏముంది. ఆర్ఆర్ఆర్ తెచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ పెరగలేదు సరికదా ఇంకొంచెం రిస్కులో పడింది. అయితే రంగస్థలం లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ ఇచ్చిన సుకుమార్ తో చేతులు కలిపాడు కాబట్టి ఫ్యాన్స్ ఆశాభావంతో ఉన్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఆర్సి 17 నవంబర్ నుంచి ప్రారంభం కానుంది. సుకుమార్ ది వేగంగా తీసే స్టైల్ కాదు. పుష్ప 1, 2 రెండు కలిపి అల్లు అర్జున్ అయిదు సంవత్సరాలు త్యాగం చేశాడు. దానికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ అందుకున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు. కానీ రామ్ చరణ్ కు కూడా అదే చేస్తే ఇబ్బందవుతుంది. పక్కా ప్లానింగ్ ఉంటే 93 రోజుల్లో రెండు వేల కోట్ల సినిమా తీయొచ్చని క్రిస్టోఫర్ నోలన్ నిరూపించారు. అలాంటిది టాలీవుడ్ దర్శకులు చేయలేరా.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఆర్సి 17 ఫైనల్ స్క్రిప్ట్ దాదాపు లాక్ అయ్యిందట. మొదట రెండు భాగాలనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడది సింగల్ పార్ట్ కే పరిమితం చేస్తున్నారని ఫ్రెష్ అప్డేట్. ఈసారి పల్లెటూరి బ్యాక్ డ్రాప్, మాఫియా లేకుండా ఫ్రెష్ జానర్ ఎంచుకున్నారట. స్టయిలిష్ యాక్షన్ తో పాటు అభిమానులు ఆశించే కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా సుకుమార్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారట. వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఉండొచ్చని వినికిడి. 

This post was last modified on July 18, 2026 10:49 pm

Share

Recent Posts

హీరోయిన్ రాధను సొంత అక్కే 46 కోట్లు మోసం చేసిందా?

ఆర్థిక వ్యవహారాలు రక్త సంబంధీకులు, తోడబుట్టిన వాళ్ల మధ్య కూడా చిచ్చు పెట్టే ఉదంతాలు ఎన్నో చూస్తుంటాం. సెలబ్రెటీల్లో కూడా…

43 minutes ago

దిల్ రాజు ద‌గ్గ‌ర ఆ డ‌బ్బులు తీసుకోని ప‌వ‌న్‌

సామాన్య జ‌నాల్లోనే కాదు.. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల్లోనూ పెద్ద సంఖ్య‌లో వీరాభిమానుల‌ను సంపాదించుకున్న హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. తాము…

4 hours ago

క్లారిటీ ఇవ్వాలంటోన్న సేన‌.. వెయిట్ అంటోన్న సేనాని..!

ఏపీలో స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం రెడీ అయింది. దీనికి సంబంధించిన ఓట‌ర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..…

4 hours ago

ఔరా అవినాష్‌… పోలీసుల‌తో చెల‌గాట‌మా?!

మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు, ప్ర‌స్తుత వైసీపీ నేత‌, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు దేవినేని అవినాష్ పోలీసుల‌తో…

5 hours ago

రాకా రికార్డులు అప్పుడే మొదలైపోయాయి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో తెరకెక్కుతున్న రాకా విడుదల చాలా దూరంలో ఉండగానే రికార్డుల వేట…

6 hours ago

‘లస్ట్’ కథలు ఈసారి బెస్ట్ కాలేదా

కామం కాన్సెప్ట్ మీద తీసిన వెబ్ సిరీస్ గా లస్ట్ స్టోరీస్ మొదటి సీజన్ కు విపరీతమైన ఆదరణ దక్కింది.…

7 hours ago