కొత్త శుక్రవారం వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర బోలెడు సినిమాలు కనిపిస్తున్నాయి కానీ వెంటనే వెళ్ళిపోదామనిపించేలా ఏదీ లేకపోవడం బయ్యర్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఏవైనా రెండు మూడు యునానిమస్ టాక్ తెచ్చుకుంటే తప్ప వీకెండ్ అయ్యాక నిలవడం కష్టం అనిపిస్తోంది. అందుకే జనాలంతా హాలీవుడ్ మూవీ ‘ది ఒడిస్సి’ మీద పడుతున్నారు. ఈసారి తెలుగు డబ్బింగ్ కూడా సమాంతరంగా రిలీజ్ చేయడం కల్లెక్షన్ల పరంగా చాలా పెద్ద ప్లస్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
సరే పెద్ద స్క్రీన్ మీద ఎక్కువ ఆప్షన్లు లేవనుకుంటే ఓటిటిలో సరిపడా ఎంటర్ టైన్మెంట్ ఆడియన్స్ కోసం రెడీ అయ్యింది. కేవలం నాలుగు వారాల విండోతో సమంత ‘మా ఇంటి బంగారం’ నిన్న అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి డిజిటల్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. నవీన్ వడ్డే కంబ్యాక్ మూవీగా తెగ ప్రచారం చేసిన ‘ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు’ కనీసం బుల్లితెరపై అయినా పని చేస్తుందేమో చూడాలి.
రఘు కుంచె ప్రధాన పాత్ర పోషించిన ‘గేదెల రాజు’ థియేటర్లలో వచ్చిన సంగతే జనాలకు గుర్తు లేదు. కాస్తో కూస్తో కొంచెం డీసెంట్ టాక్ వినిపించింది కానీ టికెట్లు కొనేందుకు అది సరిపోలేదు. మరి ఓటిటిలో అయినా ఆడియన్స్ చూసి నాలుగు మాటలు చెబుతారో లేదో చూడాలి. కొద్దిరోజుల క్రితం సాయిపల్లవి హిందీ డెబ్యూ ‘ఏక్ దిన్’ తెలుగు డబ్బింగ్ తో సహా అన్ని భాషల్లో అందుబాటులోకి వచ్చినా ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. సోషల్ మీడియాలో సౌండే లేదు.
మొత్తానికి కాలు కదపకుండా టైం పాస్ చేసేందుకు సరిపడా ఆప్షన్లు అందుబాటులోనే ఉన్నాయి. ‘పెద్ది’ ట్రెండింగ్ లో కొనసాగుతోంది కానీ టాప్ ఫైవ్ దగ్గర ఆగిపోవడం ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. ప్రస్తుతం థియేటర్లలో ‘లెనిన్’ ఒకటే ఆప్షన్ గా ఉన్న పరిస్థితిలో దానికి ఇంకో వారం స్పేస్ దొరికేలా ఉంది. వీకెండ్ కనక సాలిడ్ గా నిలబడితే వంద కోట్ల మీద ఆశలు పెట్టుకోవచ్చు. ఇదిలా ఉంచితే థియేటర్ కు పోటీగా ఓటిటిలోనూ ప్రతి వారం కంటెంట్ ఓవర్ లోడ్ అవ్వడం గమనించాల్సిన విషయం.
This post was last modified on July 17, 2026 7:04 pm
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్‌లో రీల్ తీసుకునేందుకు…