Movie News

సినిమా పిచ్చిలో ఇది వేరే లెవెల్

సినిమా పిచ్చిలో ఎన్నో రకాలు చూశాం. కానీ ఇది వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ అనే విషయంలో భిన్నాభిప్రాయాలు లేని క్రిస్టోఫర్ నోలన్ నుంచి వచ్చిన కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ కోసం సినీ ప్రపంచం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తోందో తెలిసిందే.

ఆ ప్రపంచంలో భాగమైన ఒక వీరాభిమాని.. నోలన్ సినిమా కోసం ఏకంగా తన ప్రెగ్నెన్సీనే వాయిదా వేసుకుందట. ఈ విషయం ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతోంది. ఆ అభిమాని పేరు.. ఆంబర్ కనాగన్. 29 ఏళ్ల ఈ టెక్ ఎడిటర్.. కాలిఫోర్నియా నివాసి. ఆమెకు ఇప్పటికే ఒక బిడ్డ ఉండగా.. రెండో సంతానం కోసం ప్లాన్ చేస్తున్న టైంలో నోలన్ కొత్త చిత్రం ‘ది ఒడిస్సీ’ రాబోతుండడంతో ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుందట.

ది ఒడిస్సీని తొలి రోజే భారీ ఐమాక్స్ తెరలో చూడాలన్నది ఆంబర్ ఆశ. తాను ప్రెగ్నెంట్ అయితే తాను ఉంటున్న ప్రాంతం నుంచి మూడు గంటలు ప్రయాణించి ఐమాక్స్ 70 ఎంఎం థియేటరుకు వెళ్లి ‘ది ఒడిస్సీ’ సినిమాను చూడలేనన్న ఉద్దేశంతో ఆమె ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుందట. తనే స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్లి ఐమాక్స్ 70 ఎంఎం థియేటర్లో తన అభిమాన దర్శకుడి సినిమాను ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాలన్నది ఆంబర్ ఆశ.

అందుకోసమే ఆమె ప్రెగ్నెన్సీని వాయిదా వేసుకుందట. ఈ విషయం మీడియాలోకి రావడంతో అభిమానంలో ఇది వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది ఒడిస్సీ’కి పాజిటివ్ రివ్యూలు, టాక్ వస్తున్నాయి. ఇండియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలైంది. ఇక్కడి సూపర్ స్టార్ల సినిమాల స్థాయిలో దీనికి ఓపెనింగ్స్ రాబోతున్నాయి

This post was last modified on July 17, 2026 2:21 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

45 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

55 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

1 hour ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago