రణ్‌భీర్ కపూర్ అంటే ఇండియాలో ఆడపిల్లలు చెవులూ ముక్కులూ కోసేసుకుంటారు. మామూలు ఆడపిల్లల మాటెందుకు హీరోయిన్లే అతడితో ప్రేమలో మునిగి ఒకరి తర్వాత ఒకరుగా తేలిపోతున్నారు. దీపిక, కత్రినా, ఆలియా… ఇలా బాలీవుడ్ టాప్ బ్యూటీస్ అంతా అతడితో ప్రేమలో పడిపోయిన వాళ్లే. అతని ఛార్మ్ అలాంటిది. అయితే అలాంటి రణ్‌భీర్ కపూర్‌ని కూడా ఒక హీరోయిన్ ఛీ కొట్టిందట. హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్మన్ అంటే రణ్‌భీర్‌కి చాలా ఇష్టమట. ఒకసారి న్యూయార్క్ వీధుల్లో ఆమెను చూసి, గుర్తుపట్టి, వెంటపడి తనతో ఒక ఫోటో దిగమని అడిగాడట.
ఆమె కోపంగా ‘గెట్లాస్ట్’ అని తిట్టేసిందట. అయితే ఆమెను చూసిన ఆనందంలో తను ఆ సమయంలో ఏడుస్తోందని గుర్తించలేదని, ఒకసారి ఛీ కొట్టినా కానీ మళ్లీ తను కనిపిస్తే అలాగే ఫోటో అడుగుతానని రణ్‌భీర్ చెప్పాడు. అతడిని ఛీ కొట్టిందంటే అప్పటికి అతను హీరో కాలేదని అనుకుంటున్నారో ఏమో. అప్పటికే అతను సూపర్‌స్టార్ అయిపోయాడు కూడా. చూస్తోంటే మన బాలీవుడ్ హీరోయిన్లు దీపిక, ప్రియాంక లాంటి వాళ్లకు వున్న గుర్తింపు మన హీరోలకు లేనట్టుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates