Movie News

వదిలేయడమే అఖిల్ చేసుకున్న అదృష్టం

లెనిన్ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ చాలా ఏరియాలలో బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలు ఇస్తోంది. బిజినెస్ మరీ ఎక్కువ ధరలకు చేయకపోవడం ప్లస్ రెగ్యులర్ టికెట్ రేట్లతోనే ప్రొసీడ్ కావడం చాలా కలిసి వచ్చింది. వంద కోట్ల మార్కు అందుకుంటుందా లేదానేది ఈ వీకెండ్ మీద ఆధారపడి ఉంటుంది. హాలీవుడ్ మూవీ ఒడిస్సి తప్ప చెప్పుకోదగ్గ పోటీ లేకపోవడంతో వీకెండ్ మళ్ళీ లెనిన్ జోరు చూపించడంలో డౌట్ అక్కర్లేదు.

ఇదిలా ఉండగా అఖిల్ ఒక విషయంలో అదృష్టవంతుడిని చెప్పాలి. ఎందుకనేది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఏజెంట్ తర్వాత యువి క్రియేషన్స్ సంస్థ అఖిల్ తో ఒక భారీ ఫాంటసీ మూవీ ప్లాన్ చేసుకుంది. ధీర టైటిల్ అనుకున్నారు. ఎప్పటి నుంచో ఆ బ్యానర్ లో పని చేస్తున్న అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేసే విధంగా గ్రౌండ్ సెట్ చేశారు. దాని కోసం అఖిల్ పొడవాటి జుత్తు పెంచి పూర్తిగా మారిపోయిన ఫోటోలు ఇప్పటికీ ఉన్నాయి.

రకరకాల కారణాల వల్ల అసలది ఓపెనింగ్ జరగకుండానే ఆగిపోయింది. విశ్వంభర, ఘాటీ ఆలస్యం కావడం ఆర్థికంగా ప్రభావం చూపించగా కపుల్ ఫ్రెండ్లీ, బైకర్ అనుకున్న టైం కాకుండా లేట్ రిలీజ్ కావడం ఇంకో ఎఫెక్ట్ ఇచ్చింది. దీంతో ప్రొడక్షన్ పరంగా యూవీ వేగం తగ్గిపోయింది. ఈలోగా అఖిల్ దగ్గరకు లెనిన్ కథ రావడం, అది నచ్చడం, నాగార్జున స్టాంప్ పడటమే కాక అన్నపూర్ణని భాగస్వామిగా చేయడం జరిగిపోయాయి. ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్న లెనిన్ ఘనవిజయం.

ఒకవేళ అఖిల్ ఆ ప్యాన్ ఇండియా సినిమా చేసుంటే ఏమయ్యేదో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో లెనిన్ లాంటి విలేజ్ డ్రామానే కరెక్ట్. బడ్జెట్ పరంగా రిస్క్ లేకుండా మొత్తం రికవరీ అయిపోతుంది. నెక్స్ట్ కూడా ఇదే ఆలోచన ధోరణి కొనసాగించాలి. బాగా సెటిల్ అయ్యాక అప్పుడు పుష్ప, బాహుబలి టైపులో ఆలోచించవచ్చు. అన్నట్టు మురళికిషోర్ అబ్బూరుతోనే మరో సినిమా చేసేందుకు అఖిల్ చాలా ఆసక్తిగా ఉన్నాడట. కాకపోతే సెట్ కావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది.

This post was last modified on July 15, 2026 6:43 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago