బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి ఊసు కానీ, సోషల్ మీడియా డిస్కషన్ కానీ పెద్దగా జరగడం లేదు. వాటిలో హృదయం మురళి ఒకటి. గద్దలకొండ గణేష్ తో టాలీవుడ్ కు పరిచయమైన తమిళ హీరో అధర్వ ఇందులో కథానాయకుడు. ప్రీతీ ముకుందన్, కయదు లోహర్, మాళవిక మోహనన్, ఫహద్ ఫాసిల్, తమన్ లాంటి క్యాస్టింగ్ తో పాటు ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉన్న ఈ మూవీ శనివారం థియేటర్లలో అడుగు పెట్టింది.
ప్రాధమికంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న హృదయం మురళికి కలెక్షన్లు పెద్దగా కనిపించడం లేదు. కారణం అధర్వకు ఇక్కడ ఇమేజ్ లేకపోవడం. వివిధ దశల్లో తన ప్రేమను ఇష్టపడిన అమ్మాయిలకు వ్యక్తపరచలేకపోయిన ఒక వ్యక్తి జీవితమే హృదయం మురళి కథ. ఇందులో నోస్టాల్జియా మూమెంట్స్ ని బాగా రీ క్రియేట్ చేశారు. చిన్న ట్విస్టులు, సరదా సంఘటనలు, విసిగించకుండా సాగే కథనం ఇలా యూత్ కి కావాల్సిన టైం పాస్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి.
కొన్ని నెగటివ్ పాయింట్స్ ఉన్నా కానీ వాటి కన్నా సానుకూలంగా ఉన్న పబ్లిక్ టాకే ఎక్కువ బయటికి వచ్చింది. అయితే హృదయం మురళి మన దగ్గర నిలబడుతుందా లేదానేది వేచి చూడాలి. ఎందుకంటే వీకెండ్ మొత్తం లెనిన్ డామినేషన్ కొనసాగింది. దాని వల్ల ఇతర సినిమాలు ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం. హృదయం మురళి చేసుకున్న వీక్ ప్రమోషన్స్ వల్ల అసలది రిలీజైన విషయమే చాలా మంది కామన్ ఆడియన్స్ కు తెలియకుండా పోయింది.
ఈ రెండు మూడు రోజుల్లో ఏమైనా ప్రచారాలు మొదలుపెడితే కొంచెం బెటర్ గా ఉండొచ్చు కానీ ఆ సూచనలు కనిపించడం లేదు. తమిళంలో ఇదయం మురళి బాగానే ఆడుతున్నట్టు రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గట్టే ఉన్నాయి. ఎటొచ్చి మన దగ్గరే కొంచెం అటుఇటు ఊగుతోంది. సంగీత దర్శకుడిగా లెనిన్, నటుడు ప్లస్ మ్యూజిక్ డైరెక్టర్ గా హృదయం మురళి ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజై తమన్ కు ఒక స్పెషల్ డేని మిగిల్చాయి.
This post was last modified on July 13, 2026 5:31 pm
కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని అనుకునేవారు.. కేంద్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…
విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి…
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…