Political News

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ పార్టీ బ్లెడ్ పాలిటిక్స్‌(ర‌క్త రాజ‌కీయం) కు తెర‌దీసింది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతుల ర‌క్తం చ‌విచూస్తున్నార‌ని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌.. సీఎంకు కావాలంటే త‌మ ర‌క్తం ఇస్తామ‌ని, రైతుల‌ను ఆదుకోవాల‌ని ఆదివారం ఎక్స్ వేదిక‌గా కామెంట్లు చేశారు.

అనంత‌రం.. సోమ‌వారం జూబ్లీహిల్స్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాల‌యంలో ఆ పార్టీ విద్యార్థి, యువ‌జ‌న విభాగం కార్య‌క‌ర్త‌లు ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించారు. ఈ శిబిరాల్లో ప‌లువురు విద్యార్థులు ర‌క్తం దానం చేశారు. అనంత‌రం.. ఈ ర‌క్తాన్ని స‌చివాల‌యానికి తీసుకువెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చి.. నిర‌స‌న తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో పోలీసులు బీఆర్ ఎస్ విద్యార్థి, యువజ‌న విభాగం కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకుని ర‌క్తం బాటిళ్లు, ప్యాకెట్ల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్యుద్ధం న‌డిచింది. అయిన‌ప్ప‌టికీ.. పోలీసులు మ‌రింత మందిని రంగంలోకి దింపి బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల‌ను అడ్డుకున్నారు. ఇదిలావుంటే.. అస‌లు ఇంత రాజ‌కీయం అవ‌స‌ర‌మా? అనేది ప‌రిశీల‌కుల మాట‌. రైతుల‌ను ఆదుకునే విష‌యంలో గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూడా వెనుక‌బ‌డే ఉంద‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. రాజ‌కీయం చేసేందుకు అనేక అంశాలు ఉన్నాయ‌ని రైతుల‌కు నీటిని విడుద‌ల చేయ‌క‌పోతే.. ఆ మేర‌కు మ‌రో మార్గం ఎంచుకోవాల‌ని చెబుతున్నారు.

ఇక‌, బీఆర్ఎస్ బ్లెడ్ పాలిటిక్స్‌పై కాంగ్రెస్ తీవ్రంగా మండిప‌డింది. గ‌తంలో బీఆర్ఎస్ పాల‌కులు రైతుల‌కు సంకెళ్లు వేసి జైలుకు త‌ర‌లించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. న‌ల్గొండ‌, మ‌హ‌బూబాబాద్ వంటి జిల్లాల్లో రైతులు.. గిట్టుబాటు ధ‌ర కోసం రోడ్డెక్కితే లాఠీల‌తో ఎలా కొట్టించారో చూడండి.. అంటూ.. నాటి ఫొటోల‌ను పోస్టు చేశారు. అంతేకాదు.. రైతుల‌పై నాడు మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించ‌డం గ‌మ‌నార్హం.  మొత్తంగా బీఆర్ ఎస్ బ్లెడ్ పాలిటిక్స్ ఎవ‌రికి మేలు చేస్తాయో చూడాలి.

This post was last modified on July 13, 2026 7:08 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

9 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

11 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

11 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

13 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

14 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

15 hours ago