పూరి జగన్నాథ్ సినిమా అంటే ప్రేక్షకుల్లో అదో రకమైన స్పెషల్ క్రేజ్ ఉండేది. స్టార్ హీరోతో చేసినా, కొత్తవాళ్లతో తీసినా తన పేరు మీదే ఓపెనింగ్స్ తెచ్చుకోవడంలో ఆయన శైలి వేరు. అయితే లైగర్, డబుల్ ఇస్మార్ట్ మార్కెట్ లో పూరి బ్రాండ్ మీద నమ్మకాన్ని తగ్గించిన మాట వాస్తవం. ఆర్థిక లావాదేవీల వల్ల ఏర్పడ్డ వివాదాలు లేనిపోని తలనెప్పి తెచ్చిపెట్టాయి. వాటిలో ఇప్పటికీ కొన్ని పరిష్కారం కోసం పోరాటం చేస్తున్నాయట. ఎప్పటికి తెగుతాయో కాలమే సమాధానం చెప్పాలి.
ఇక అసలు విషయానికి వస్తే పూరి కొత్త ప్యాన్ ఇండియా మూవీ ‘స్లమ్ డాగ్’ షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. ఆ మధ్య టీజర్ వదిలారు. రెస్పాన్స్ బాగానే వచ్చింది. మాఫియా సెటప్ ఉన్నప్పటికీ ఏదో కొత్త కథ చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే క్లారిటీ వచ్చింది. బిచ్చగాడు, పోకిరి కలిస్తే ఏమవుతుందో అన్న తరహాలో డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో ఇది ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ స్లమ్ డాగ్ విడుదల ఎప్పుడనేది ఇంకా తేలలేదు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సినిమాకు బజ్ తగ్గకుండా ఉండాలంటే రెగ్యులర్ అప్డేట్స్ తో పాటు వీలైనంత జాప్యం లేకుండా రిలీజ్ ప్లాన్ చేసుకోవడం అవసరం. అయితే ఓటిటి డీల్స్ ఆలస్యం, థియేటర్ బిజినెస్ లో సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల మంతనాలు బేరాలు ఇలా సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న ప్రొడ్యూసర్లు చాలా ఉన్నారు. వందల కోట్ల పెట్టుబడి పెట్టిన కొన్ని చిత్రాలకు సైతం ఈ కష్టాలు తప్పట్లేదు. మరి స్లమ్ డాగ్ చిక్కేమిటో.
విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ గా నటించగా టబు ఓ కీలక పాత్ర పోషించారు. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నాడు. క్యాస్టింగ్, టెక్నికల్ టీమ్ పరంగా పూరి జగన్నాథ్ ఈసారి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారట. గతం గుర్తుపెట్టుకుని విజయేంద్రప్రసాద్ సలహాలు కూడా అందుకున్నారని టాక్. 2026లోనే విడుదలవుతుంది కానీ ఎప్పుడనేది సస్పెన్స్ గా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates