ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్ లో మూవీస్ రావడం కొత్త కాదు కానీ ఈసారి హైప్ చాలా ఎక్కువగా ఉన్న విషయం అడ్వాన్స్ బుకింగ్ చూస్తే అర్థమైపోతుంది. హైదరాబాద్ అల్లు మల్టీప్లెక్స్ లో ముందు రోజు రాత్రి వేస్తున్న ప్రీమియర్లు ఏకంగా ఎమ్మెల్యేలు రికమండ్ చేస్తున్నా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొందట. మంచి సౌండ్ స్క్రీన్ ఉన్న ప్రతిచోటా ఎల్లుండి కూడా ఇంచుమించు ఇదే సిచువేషన్ కనిపిస్తోంది.
మొదటి రోజు ఇండియా వైడ్ ఓపెనింగ్ చాలా పెద్ద నెంబర్ రావడం ఖాయం. అది ముప్పై నుంచి యాభై కోట్లు లేదా అటుపైన ఎంతదాకైనా వెళ్లొచ్చని ఒక అంచనా. ఇదిలా ఉండగా సాలీడు మనిషి జోరు చూసి ఇతర రిలీజులు టెన్షన్ పడే పరిస్థితి తలెత్తుతోంది. ముఖ్యంగా సూపర్ హిట్ టాక్ తో మంచి స్వింగ్ మీద ఉన్న చెన్నై లవ్ స్టోరీకి ఏ సెంటర్స్ లో సాలీడు మనిషి నుంచి ముప్పు పొంచి ఉంది. పాజిటివ్ టాక్ వచ్చినా ఇక క్లాసు మాసు లేదు అధిక శాతం స్పైడర్ మ్యాన్ కు ఎగబడతారు.
ఇదొక్కటే కాదు జయకృష్ణ ఘట్టమనేని డెబ్యూ శ్రీనివాస మంగాపురంకి కూడా ఈ టెన్షన్ తప్పలేదు. అసలే కొత్త కుర్రాడు. పెద్ద ఎత్తున హైప్ ఏర్పడలేదు. కంటెంట్ మీద నమ్మకం, పబ్లిక్ టాక్ మీద భరోసాతో యూనిట్ ధైర్యం చేస్తోంది. అయితే స్పైడర్ మ్యాన్ మేనియా ప్రభావం దీని మీద పడుతుందేమోననే అనుమానాలు లేకపోలేదు. సుమంత్ న్యూటన్ థర్డ్ లాకు కూడా సమస్య ఎదురుకోవాల్సిందే. ఇదంతా ముందే ఊహించి క్రేజ్ ఉన్న బాలీవుడ్ సినిమాలేవీ రేసులో లేవు.
ది ఒడిస్సిలాంటి స్లో యాక్షన్ డ్రామానే మన దేశంలో పది రోజులకు వంద కోట్లు దాటగా లేనిది స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇంకెంత అరాచకం చేస్తుందో వేరే చెప్పాలా. టాక్ వస్తే చాలు ఊచకోత అనే మాట చిన్నదే అవుతుంది. అసలే కొన్ని నెలలుగా హిందీ నుంచి తెలుగు దాకా పెద్దగా చెప్పుకునే విజువల్ గ్రాండియర్స్ రాలేదు. అన్నీ వాయిదాల పర్వంలోనే ఉన్నాయి. అందుకే హాలీవుడ్ నుంచి ఏదైనా వస్తే చాలు థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం మూవీ లవర్స్ పొలోమని వెళ్లిపోతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
