Movie News

127 కట్స్ చెప్పారు… నేరుగా ఓటీటీలోకి

సెన్సార్ బోర్డు ఈ మధ్య సినిమాలకు ఎంత పెద్ద అడ్డంకిగా మారుతోందో తెలిసిందే. మరీ అన్యాయంగా కట్స్ చెబుతుండడం.. మామూలు సన్నివేశాలకు కూడా ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేస్తుండడం తీవ్ర వివాదాలు రేపుతోంది. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ప్రయోజనం చేకూర్చే సినిమాలైతే ఎంత వివాదాస్పదంగా ఉన్నా క్లియరెన్స్ ఇచ్చేస్తున్నారని.. వేరే సినిమాలను మాత్రం కావాలని టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు పెరుగుతున్నాయి.

ఇక తెలుగులో అయితే చిన్న సినిమాల విషయంలో సెన్సార్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంటోంది. ఏమాత్రం అసభ్యత లేని ‘దీవానా’ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై చిత్ర బృందం లబోదిబోమంది. కొన్ని సినిమాలకు రిలీజ్ దగ్గర టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది సెన్సార్ బోర్డు. ఇలా దాని చుట్టూ వివాదాలకైతే లెక్కే లేదు. ఇలాంటి టైంలో ఒక చిత్రం సెన్సార్ బోర్డు దెబ్బకు థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ చిత్రమే.. సత్లుజ్.

పంజాబ్‌కు చెందిన మానవ హక్కుల నేత జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా ‘సత్లుజ్’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ముందు ‘పంజాబ్ 95’ పేరుతో రూపొందించాడు దర్శకుడు హనీ టెహ్రాన్. పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. పంజాబ్‌లో 25 వేల మందిని అన్యాయంగా పోలీసులు చంపిన విషయాన్ని తన పరిశోధన ద్వారా వెలుగులోకి తెచ్చిన జస్వంత్ సింగ్.. 1995లో హత్యకు గురయ్యాడు.

అతణ్ని ఆరుగురు పోలీసులే ఎత్తుకెళ్లి చంపేశారని అభియోగాలు ఎదుర్కొన్నారు. ఎన్నో వివాదాలతో ముడిపడ్డ సినిమా కావడంతో దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరాలు చెప్పింది. మూడేళ్లుగా సెన్సార్ బోర్డుతో పోరాడి పోరాడి అలసిపోయింది చిత్ర బృందం. సెన్సార్ బోర్డు ఏకంగా 127 కట్స్ చెప్పిందట. అన్ని కట్స్ చేస్తే సినిమానే పోతుందని భావించిన చిత్ర బృందం.. చివరికి ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయొద్దని నిర్ణయించుకుంది. ‘సత్లుజ్’గా టైటిల్ మార్చి తాజాగా జీ5లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. దీనికి మంచి టాక్ వస్తోంది. తప్పక చూడాల్సిన సినిమాగా చూసిన వాళ్లు సోసల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

This post was last modified on July 4, 2026 6:15 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

56 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago