లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్య నారాయణ తన ఇద్దరు కొడుకుల విషయంలో చేసిన ప్లానింగ్ వేరు. కానీ జరిగింది వేరు. ఇద్దరిలో పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ అందంగా ఉంటాడని భావించి అతణ్ని హీరోను చేయాలనుకున్నాడు ఈవీవీ. చిన్న కొడుకు అల్లరి నరేష్ లుక్స్ పరంగా కొంచెం యావరేజ్ కాబట్టి తనను హీరోను చేయడంపై ఆయన అంత ఆసక్తిగా లేరు మొదట్లో. తన వారసత్వాన్నందుకుని అతను దర్శకుడవ్వాలని కోరుకున్నారు.
ఈవీవీ దగ్గరే కొన్ని చిత్రాలకు దర్శకత్వ శాఖలోనూ పని చేశాడు నరేష్. కానీ విధి విచిత్రంగా వారి దారులను మార్చేసింది. ‘హాయ్’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన ఆర్యన్ రాజేష్ సక్సెస్ అందుకోలేకపోయాడు. తర్వాత మరిన్ని చిత్రాలు చేశాడు కానీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. ‘ఎవడి గోల వాడిది’ హిట్టయినా తన కెరీర్‌కు ఉపయోగపడలేదు. దీంతో క్రమంగా సినీ రంగానికి దూరం అయిపోయాడు రాజేష్. మరోవైపు నరేష్ హీరోగా మంచి రేంజికి వెళ్లాడు. మళ్లీ కెరీర్ కొంచెం గాడి తప్పినా.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు.
ఐతే పూర్తిగా కనుమరుగైపోయిన ఆర్యన్ రాజేష్ చాలా ఏళ్ల తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుండడం విశేషం. తన తండ్రి నెలకొల్పిన ఈవీవీ సినిమా బేనర్‌ను అతను మళ్లీ వెలుగులోకి తెస్తున్నాడు. ఆ బేనర్ మీద ఈవీవీ ‘చాలా బాగుంది’ సహా పలు చిత్రాలు నిర్మించారు. చివరగా అల్లరి నరేష్ హీరోగా ఆయన ‘ఫిట్టింగ్ మాస్టర్’ తీశారు. తర్వాత ఆ బేనర్ ఆగిపోయింది. ఐతే ఇప్పుడు ఆర్యన్ రాజేష్ ఈ సంస్థలో కొత్త సినిమాను మొదలుపెట్టాడు.
అందులో హీరో నరేష్ ఏమీ కాదు. ‘కోర్ట్’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన టీనేజీ నటుడు హర్ష్ రోషన్ ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రంతో ప్రియాంక అచ్చర్ కథానాయికగా పరిచయం కానుండగా.. కొత్త దర్శకులు అరుణ్-బాలాజీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ అని చెబుతున్నారు. హర్ష్ ‘కోర్ట్’తో మంచి గుర్తింపు సంపాదించినా.. ఈ ఏడాది ‘బ్యాండ్ మేళం’ సినిమాతో ఎదురు దెబ్బ తిన్నాడు. మరి ఈ కుర్రాడితో చేస్తున్న సినిమా ‘ఈవీవీ సినిమా’కు పునర్వైభవం తెచ్చి పెట్టి ఆర్యన్ రాజేష్‌ను నిర్మాతగా నిలబెడుతుందేమో చూడాలి.
This post was last modified on July 4, 2026 5:18 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…