Movie News

మహా కామెంట్స్… ‘రావు బహదూర్’పై ఎటాక్

సెలబ్రెటీలు స్టేజ్‌ల మీద మాట్లాడేటపుడు.. ఇంటర్వ్యూలు ఇచ్చినపుడు ఏం మాట్లాడుతున్నామో కాస్త స్పృహతో ఉండడం ఎంతో అవసరం. ఈ సోషల్ మీడియాలో రోజుల్లో హద్దులు దాటి మాట్లాడితే.. అవి పెద్ద వివాదంగా మారి వారి సినిమాలనే దెబ్బ తీస్తుంటాయి. చిన్న చిన్న కామెంట్లను కూడా పట్టుకుని హేట్ క్యాంపైనింగ్స్ ఎలా నడుపుతారో తెలిసిందే. ఒకసారి మాట తూలాక వివరణ ఇచ్చుకున్నా కూడా పెద్దగా ఫలితం ఉండదు.

టాలీవుడ్ యువ దర్శకుడు వెంకటేష్ మహా విషయంలో ఇదే జరుగుతోంది. తన కొత్త చిత్రం ‘రావు బహదూర్’ను సోషల్ మీడియాలో ఒక వర్గం గట్టిగా టార్గెట్ చేస్తోంది. ఈ శుక్రవారం రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కొందరేమో తెలుగులో వచ్చిన గొప్ప చిత్రాల్లో ఒకటని కొనియాడుతున్నారు. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అరుదని.. మన ఆడియన్స్ ఇలాంటి వినూత్న చిత్రాలను తప్పక ఆదరించాలని అంటున్నారు. అదే సమయంలో ఇంకొందరు మాత్రం సినిమా పరమ బోరింగ్ అని.. చిన్న పాయింట్ పట్టుకుని విపరీతంగా సాగదీశారని తిట్టిపోస్తున్నారు.

ఐతే రెండో వర్గంలో కొందరు సినిమా జస్ట్ బాగాలేదని ఊరుకోవట్లేదు. వెంకటేష్ మహా పాత కామెంట్లను ఉటంకిస్తూ ఈ సినిమాను టార్గెట్ చేస్తున్నారు. కొన్నేళ్ల ముందు కొందరు యువ దర్శకులతో కలిసి నిర్వహించిన రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూల్లో కమర్షియల్ సినిమాల్లో సన్నివేశాల గురించి చాలా తేలికగా మాట్లాడాడు మహా. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ చిత్రాలను అతను కించపరిచేలా మాట్లాడాడన్నది ఆరోపణ. ఈ కామెంట్లు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

ఒక్క సినిమా దర్శకుడు కమర్షియల్ సినిమాల గురించి ఇంత తక్కువ చేసి మాట్లాడ్డం ఏంటంటూ అతడి తీరును దుయ్యబట్టారు. ఐతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మహా ఆ కామెంట్ల గురించి వివరణ ఇచ్చాడు. తాను విమర్శించింది కమర్షియల్ సినిమాలను కాదని, అల్ట్రా వయొలెంట్ మూవీస్ గురించి అని అన్నాడు. కానీ తన కామెంట్లు వింటే ఆ అభిప్రాయం కలగదు.

ఆ కామెంట్లను గుర్తు పెట్టుకుని.. ఇప్పుడు ‘రావు బహదూర్’కు లింక్ చేసి విమర్శలు గుప్పిస్తోంది ఒక వర్గం. చిన్న పాయింట్‌ను లాగి లాగి, ఇంత బోరింగ్ సినిమా తీసిన దర్శకుడు.. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాలను మాత్రం తప్పుబడతాడని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పుడు మహా తన సినిమాతో ప్రేక్షకులను ఏమేర మెప్పిస్తాడో.. ఎంతమేర వసూళ్లు రాబడతాడో తేలిపోతుందని అంటున్నారు.

This post was last modified on July 4, 2026 5:21 pm

Share

Recent Posts

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

1 hour ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

1 hour ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

2 hours ago

ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు

వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…

2 hours ago

13 రోజుల చిన్నారికి పాస్పోర్ట్ – రికార్డ్ సృష్టించిన తెలుగు బిడ్డ

పుట్టిన 13 రోజులకే పాస్పోర్ట్ తీసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని దాసన్నపేటకు చెందిన…

3 hours ago

హీరోయిన్ని వెంటాడిన దుల్కర్ డిజాస్టర్

కొన్ని సినిమాల ఫెయిల్యూర్లు కొందరు కెరీర్ల మీద తీవ్ర ప్రభావమే చూపిస్తుంటాయి. ఒక మూవీలో చాలామంది భాగం అయినా.. కొందరి మీదే ఎక్కువ ప్రభావం…

3 hours ago