Movie News

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి

కొందరు దర్శకులు అరంగేట్రంలో అదరగొట్టి తర్వాత నిరాశ పరుస్తుంటారు. కొందరేమో తొలి సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తర్వాత పుంజుకుని ఆశ్చర్యపరిచే సినిమా కంటెంట్ అందిస్తుంటారు. కార్తీక్ వర్మ దండు రెండో కోవకే చెందుతాడు. తన తొలి చిత్రం భం బోలేనాథ్ రిలీజ్ అయిన విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ తర్వాత చిత్రం విరూపాక్ష 100 కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచి అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. 

ఈ సుకుమార్ శిష్యుడు ఇప్పుడు వృషకర్మ సినిమాతో రాబోతున్నాడు. అక్కినేని నాగచైతన్య హీరోగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు కారణం స్టన్నింగ్ టీజర్, ట్రైలర్లే. విరూపాక్ష లాగే వృషకర్మ కూడా హారర్ టచ్ ఉన్న మిస్టిక్ థ్రిల్లరే. ఈ రెండు చిత్రాలకు సీక్వెల్స్ తీయబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాడు కార్తీక్ వర్మ.

ఈ సినిమా లేటెస్ట్ ప్రెస్ మీట్లో కార్తీక్ వర్మ మాట్లాడుతూ తను హారర్లో ఉన్న అన్ని కోణాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నట్టు వెల్లడించాడు. విరూపాక్ష, వృషకర్మ రెండు మిస్టిక్ థ్రిల్లర్లే అయినప్పటికీ.. వేటికవే భిన్నమైనవని, హారర్లో సబ్ జానర్లను తాను టచ్ చేశానని చెప్పాడు. ఈ సందర్భంగానే తాను తీసే సినిమాలు అన్నిటికీ పార్ట్ 2 లు ఉంటాయని చెప్పాడు.

మరోవైపు నాగచైతన్య మాట్లాడుతూ.. వృషకర్మతో కచ్చితంగా అంచనాలను అందుకుంటామని, తన చివరి చిత్రం తండేల్ సాధించిన 100 కోట్ల వసూళ్లను కూడా దాటుతానని ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన వృషకర్మలో చైతూ సరసన మీనాక్షి చౌదరి నటించింది. బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. డిసెంబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on November 28, 2026 11:19 pm

Share

Recent Posts

రా.వన్ సినిమా సీన్ రిపీట్ అవుతుందా?

ఈ రోజుల్లో ఏ చిన్న సమాచారం కావాలన్నా ఏఐ చాట్‌బాట్లను ఆశ్రయించడం సాధారణమైపోయింది. చదువు, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యక్తిగత పనులు..…

3 hours ago

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత

ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలంటే చేతిలో ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోని…

6 hours ago

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ల మధ్య రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో…

7 hours ago

మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ దాదాపు కేంద్ర‌ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతోంది. గ‌త నాలుగు రోజులుగా కేంద్రంలో జ‌రుగుతున్న…

7 hours ago

బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా నాయకుల్లో సందడి వాతావరణం నెలకొంది. మహిళా రిజర్వేషన్…

7 hours ago

సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలా ఆడినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తారు. అలాంటి చిత్రమే ఆదర్శ…

7 hours ago