Trends

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత

ఇకపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలంటే చేతిలో ఫోన్ పట్టుకుని గంటల తరబడి స్క్రోల్ చేయాల్సిన అవసరం లేదు. నేరుగా ఇంట్లోని స్మార్ట్ టీవీలోనే రీల్స్ చూసే సదుపాయాన్ని మెటా తీసుకొస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్‌ను పరిచయం చేస్తోంది. దీంతో మొబైల్‌లో చూసే చిన్న చిన్న వీడియోలను పెద్ద తెరపై ఆస్వాదించవచ్చు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఇష్టమైన వీడియోలు చూసేందుకు కూడా ఈ సదుపాయం ఉపయోగపడుతుంది.

ముంబైలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మెటా ఈ కొత్త యాప్ గురించి ప్రకటించింది. భారత్‌లోనూ దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. యాపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి పరికరాల్లో ఈ యాప్ పనిచేస్తుంది. అయితే అన్ని స్మార్ట్ టీవీల్లోనూ ఈ సదుపాయం ఉండకపోవచ్చు. వినియోగదారులు తమ టీవీకి ఈ యాప్ సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి.

ఈ యాప్‌లో రీల్స్ చూడటం చాలా సులభంగా ఉంటుంది. మొబైల్‌లో మాదిరిగానే ఒక వీడియో తర్వాత మరొక వీడియోను చూడవచ్చు. కామెడీ, సినిమా, వంటలు, ప్రయాణాలు, క్రీడలు ఇలా మనకు నచ్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను ఎంచుకోవచ్చు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న రీల్స్‌తో పాటు మనం ఫాలో అయ్యే క్రియేటర్ల వీడియోలు కూడా టీవీలో కనిపిస్తాయి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీడియోలను మార్చుకోవడానికి ఫోన్ అవసరం లేదు. టీవీ రిమోట్‌తోనే నచ్చిన వీడియోను ఎంచుకోవచ్చు. వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవుతాయి. దీంతో ప్రతిసారీ కొత్త వీడియో కోసం వెతకాల్సిన పని ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫొటోలు, ఇతర పోస్టులను కూడా పెద్ద తెరపై చూసే అవకాశం ఉంటుంది.

ఒకే టీవీని ఇంట్లో అందరూ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఒక యాప్‌లో ఐదు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల వరకు జోడించే వసతిని మెటా కల్పిస్తోంది. దీనివల్ల కుటుంబ సభ్యులు తమకు నచ్చిన వీడియోలను విడివిడిగా చూడవచ్చు. అవసరమైతే టీవీ కోసం ప్రత్యేకంగా మరో ఖాతాను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఫోన్‌లో చూస్తున్న రీల్‌ను నేరుగా టీవీలో చూడాలనుకుంటే ఆ సదుపాయం కూడా ఉంది. ఇందుకోసం మొబైల్, టీవీ ఒకే వైఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి. ఫోన్‌లోని క్యాస్టింగ్ ఆప్షన్ ద్వారా వీడియోను టీవీకి పంపవచ్చు.

పిల్లలు కూడా టీవీల్లో ఇన్‌స్టాగ్రామ్ చూసే అవకాశం ఉన్నందున వారి భద్రతపై మెటా దృష్టి పెట్టింది. టీనేజర్ల ఖాతాలకు ఇప్పటికే ఉన్న భద్రతా నిబంధనలు ఈ యాప్‌లోనూ వర్తిస్తాయి. వయసుకు తగిన కంటెంట్ అందించేలా పరిమితులు ఉంటాయి. ఇప్పటివరకు మొబైల్‌కే పరిమితమైన రీల్స్ వినోదాన్ని టీవీ వరకు తీసుకురావడం ద్వారా మెటా కొత్త ప్రయోగం చేస్తోంది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే స్మార్ట్ టీవీల్లో వీడియోలు చూసే వారికి మరో కొత్త ఎంపిక అందుబాటులోకి వచ్చినట్లే.

This post was last modified on November 28, 2026 11:12 pm

Share

Recent Posts

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి

కొందరు దర్శకులు అరంగేట్రంలో అదరగొట్టి తర్వాత నిరాశ పరుస్తుంటారు. కొందరేమో తొలి సినిమాతో నిరాశపరిచినప్పటికీ, తర్వాత పుంజుకుని ఆశ్చర్యపరిచే సినిమా…

54 minutes ago

21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ల మధ్య రాజకీయ విభేదాలున్న సంగతి తెలిసిందే. గతంలో…

3 hours ago

మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ దాదాపు కేంద్ర‌ప్ర‌భుత్వానికి అనుకూలంగా మారుతోంది. గ‌త నాలుగు రోజులుగా కేంద్రంలో జ‌రుగుతున్న…

3 hours ago

బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో ఆంధ్ర ప్రదేశ్ మహిళా నాయకుల్లో సందడి వాతావరణం నెలకొంది. మహిళా రిజర్వేషన్…

3 hours ago

సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎలా ఆడినా సరే ఓటీటీలో రిలీజ్ అవుతున్నప్పుడు ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురుచూస్తారు. అలాంటి చిత్రమే ఆదర్శ…

3 hours ago

రాహుల్ గాంధీ చెప్పే సరిహద్దుల మార్పు వాదన

డీ లిమిటేషన్ బిల్లుతో దేశంలో ప్రజా స్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్‌సభ…

4 hours ago